Minister Bandi Sanjay: ‘మేం ఓట్ల చోరీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచేదా ? – మంత్రి బండి సంజయ్
‘మేం ఓట్ల చోరీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచేదా ? - మంత్రి బండి సంజయ్
Bandi Sanjay : బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడితే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేదా అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఓట్ల చోరీకి, బీజేపీకు ఏం సంబంధమని ప్రశ్నించారు. తాము ఓట్ల చోరీ చేస్తే ఇండియా కూటమికి 230 ఎంపీ సీట్లు వచ్చేవా? కేంద్రంలో బీజేపీకి 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి? అని నిలదీశారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావుతో కలిసి బండి సంజయ్ (Bandi Sanjay) పాల్గొన్నారు. ‘‘ ఓట్ల చోరీ జరిగితే.. ఇండి కూటమికి 230 ఎంపీ సీట్లు వచ్చేవా? బీజేపీకు 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి? ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది’’ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
Union Minister Bandi Sanjay Key Comments
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… ‘మీరు మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే… మేం హిందూ కుల వృత్తులను కాపాడుకునే ఉద్యమం చేస్తాం. రోహింగ్యాలు గో బ్యాక్ ఆందోళనలు చేస్తాం. మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం అనేది హిందూ సమాజాన్ని చీల్చే మహా కుట్ర. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న డ్రామాలివి. పాతబస్తీని ఐఎస్ఐ అడ్డాగా మార్చిన రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడటం లేదు?, హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్, డ్రైక్లీన్ షాపులు ఒక వర్గం వారే నిర్వహిస్తుంటే నోరెందుకు మెదపరు?, రోహింగ్యాల గో బ్యాక్ ఉద్యమాలు చేస్తామన్నారు.
Also Read : Cloudburst: జమ్మూ ‘క్లౌడ్ బరస్ట్’ ! 60కి చేరిన మరణాలు !
