Rahul Gandhi: ఓట్ల చోరీపై ‘లాపతా ఓటు’ వీడియో విడుదల చేసిన రాహుల్‌ గాంధీ

ఓట్ల చోరీపై ‘లాపతా ఓటు’ వీడియో విడుదల చేసిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi : బిహార్‌ ఓటర్ల జాబితాలో లోపాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ‘లాపతా ఓటు’ (ఓట్లు కోల్పోయిన) అనే టైటిల్‌తో వీడియోను ఎక్స్‌లో శనివారం విడుదల చేశారు. నిమిషం నిడివి ఉన్న ఆ వీడియోలో.. పోలీసు స్టేషన్‌లో ఓ వ్యక్తి తన ఓటు చోరీ చేశారని, ఇంకా లక్షల ఓట్లు చోరీ అయ్యాయని అధికారులకు ఫిర్యాదు చేస్తారు. పోలీసు సిబ్బంది చెక్‌ చేసి అందులో తమ ఓట్లు కూడా గల్లంతుకావడంతో నిర్ఘాంతపోతారు. అలా ఆ వీడియా ముగుస్తుంది.

Rahul Gandhi Released a Video

దీనిని రాహుల్‌ (Rahul Gandhi) తన అధికారిక ఎక్స్‌లో పోస్టు చేస్తూ… ‘‘ఓటర్లందరూ చైతన్యంతో ఓ ఉద్యమంలా ముందుకు సాగాలి. మీ ఓటు చోరీ అయితే మీ ప్రాథమిక హక్కు చోరీ అయినట్లే ’’ అని పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా మనమందరం ఉద్యమంగా పోరాడి మన హక్కులను కాపాడుకుందామన్నారు. ఓట్ల చోరీ అనేది ‘డూ ఆర్‌ డై’ సమస్యగా కాంగ్రెస్‌ పేర్కొంది. ఓట్లు గల్లంతైన వారి కోసం ఓ వెబ్‌ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. అందులో పోల్‌ ప్యానెల్ నుంచి ఓట్ల గల్లంతుకు వ్యతిరేకంగా నమోదు చేసుకోవడానికి, అధికారుల నుంచి జవాబుదారీతనం కోరడానికి, డిజిటల్‌ ఓటరు జాబితాల డిమాండ్‌కు మద్దతు తెలియజేయడానికి ఆ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది.

Rahul Gandhi – బిహార్‌ లో నేటి నుంచి రాహుల్‌గాంధీ యాత్ర

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆ రాష్ట్రంలో భారీ యాత్రకు సిద్ధమయ్యారు. ఓటరు జాబితా సంక్షిప్త ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్‌) ద్వారా పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపిస్తున్న ఆయన ‘‘ఓట్‌ అధికార్‌ యాత్ర’ పేరుతో దీనిని చేపట్టనున్నారు. ఆదివారం సాసారాం నగరం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 16 రోజుల పాటు 1,300 కిలోమీటర్ల దూరం 25 జిల్లాల మీదుగా కొనసాగుతుంది. వచ్చే నెల 1న పట్నాలో నిర్వహించే భారీ సభతో ముగుస్తుంది. రాహుల్‌తో పాటు ఇండియా కూటమిలో భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, మూడు వామపక్ష పార్టీల నేతలూ పాల్గొంటారు. నడవడంతో పాటు వాహనాల్లో ప్రయాణిస్తూ రాహుల్‌ ఈ యాత్రను కొనసాగిస్తారు.

Also Read : India: ట్రంప్‌- పుతిన్‌ భేటీపై స్పందించిన భారత్‌

Leave A Reply

Your Email Id will not be published!