Mahindra Group: బీజేడీ ఎంపీకి మహీంద్రా ఉద్యోగి హత్యాచార బెదిరింపులు

బీజేడీ ఎంపీకి మహీంద్రా ఉద్యోగి హత్యాచార బెదిరింపులు

Mahindra Group: మహీంద్రా గ్రూప్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి బిజూ జనతాదళ్‌ (బీజేడీ) పార్టీ ఎంపీపై హత్యాచార బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై తాజాగా ఆ కంపెనీ స్పందించింది. ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని స్పష్టం చేసింది. తమ సంస్థలోని ఓ ఉద్యోగి రాజకీయ నాయకురాలిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన విషయం తమ దృష్టికి వచ్చిందని మహీంద్రా గ్రూప్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. వ్యక్తుల గౌరవమే తమకు ముఖ్యమని తెలిపింది. ఇలాంటి ఘటనను సహించేది లేదని స్పష్టంచేసింది. జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై తక్షణం దర్యాప్తు జరపాలని పేర్కొంది. ఈ ఆరోపణలు నిజమని తేలితే.. ఆ ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

Mahindra Group – అసలేం జరిగిందంటే ?

సత్యబ్రత నాయక్‌ అనే వ్యక్తి మహీంద్రా గ్రూప్‌లో (Mahindra Group) ఉద్యోగి. ఆయన తన ఫేస్‌బుక్‌లో ఓ ఎంపీపై హత్యాచార బెదిరింపులకు పాల్పడ్డాడు. వీటికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను ఆ ఎంపీ ఓ పోస్టు ద్వారా వెల్లడించారు. బీజేపీ కార్యకర్త అయిన సత్యబ్రత తనను అత్యాచారం చేసి చంపేస్తానంటూ బహిరంగంగా బెదిరిస్తున్నాడని తెలిపారు. ఎంపీగా తనకే ఇలాంటివి జరుగుతుంటే… ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి అని ఈసందర్భంగా కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. మరో పోస్టులో ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని, బెదిరింపులకు పాల్పడిన ఆ వ్యక్తిపై వారు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈనేపథ్యంలో పలువురు నేతలు ఆ ఎంపీకి మద్దతుగా నిలిచారు. శివసేన (ఉద్ధవ్‌) ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ… ఇలాంటి ఘటనలు సిగ్గుచేటు అన్నారు. ఆ ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని కంపెనీతో పాటు కేంద్రాన్ని కూడా కోరారు.

Also Read : Tejashwi Yadav: రాహుల్‌ ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేస్తాం – తేజస్వీ యాదవ్‌

Leave A Reply

Your Email Id will not be published!