Parliament: పార్లమెంట్‌ వద్ద భద్రతా ఉల్లంఘన ! గోడ దూకి లోపలికి వెళ్లిన అగంతకుడు !

పార్లమెంట్‌ వద్ద భద్రతా ఉల్లంఘన ! గోడ దూకి లోపలికి వెళ్లిన అగంతకుడు !

Parliament : దేశ రాజధాని దిల్లీలో పార్లమెంట్ భవనం వద్ద భద్రతాపరమైన ఉల్లంఘన చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ ప్రాంతంలో ఒక అగంతకుడు చెట్టు ఎక్కి, గోడ దూకి పార్లమెంట్‌ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు భవన్ వైపు నుంచి గోడ దూకి కొత్త పార్లమెంట్ భవనానికి చెందిన గరుడ గేట్‌ వద్దకు చేరుకున్నాడని అధికారులు తెలిపారు. ఆ చొరబాటుదారుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటిరోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీనితో పార్లమెంట్‌లోని భద్రతా సిబ్బంది వైఫల్యం మరోసారి బహిర్గతమైంది.

Parliament Severe Security Breach

2023లో పార్లమెంట్‌ (Parliament) శీతాకాల సమావేశాల వేళ లోక్‌సభ లోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌ పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు అయిన డిసెంబరు 13న ఆ ఘటన చోటుచేసుకోవడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. లోక్‌సభలోని పబ్లిక్‌ గ్యాలరీ వద్ద కూర్చొన్న ఇద్దరు యువకులు సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. రంగుల పొగను వదిలి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. అదే సమయంలో పార్లమెంట్‌ వెలుపల కూడా ఇద్దరు వ్యక్తులు ఇదేరకమైన నిరసనను చేపట్టారు. ఈ ఘటన తర్వాత పార్లమెంట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గతేడాది ఆగస్టులో కూడా ఈతరహా ఉల్లంఘన చోటుచేసుకుంది. ఓ యువకుడు పార్లమెంట్‌ గోడ దూకి లోపలికి చొరబడేందుకు యత్నించాడు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనీశ్‌గా పోలీసులు గుర్తించారు. అప్పుడు నిందితుడి వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని అప్పట్లో పోలీసులు వెల్లడించారు.

Also Read : MLA Budda Rajasekhar: ఎమ్మెల్యే బుడ్డాను అరెస్ట్‌ చేయాల్సిందే – ఫారెస్ట్‌ అధికారులు

Leave A Reply

Your Email Id will not be published!