CM Chandrababu: దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

CM Chandrababu : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగే దసరా మహోత్సవాలకు సీఎం నారా చంద్రబాబు నాయుడిని దేవస్థానం ఉన్నతాధికారులు, అర్చకులు ఆహ్వానించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu) వారు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి.. ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దుర్గ గుడి ఈవో శీనా నాయక్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్‌తోపాటు అర్చకులు పాల్గొన్నారు.

CM Chandrababu Gets Invitation

సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవి అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ సారి దసరా నవరాత్రలు 11రోజులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ వారు.. 11 అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదీకాక ఈ ఏడాది దసర నవరాత్రుల వేళ.. విజయవాడ వేదికగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవ్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఇటీవల పోరంకిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని చిన్ని , ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్‌ తో పాటు బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్న సంగతి తెలిసిందే.

విజయవాడ ఉత్సవ్‌ కు రామ్‌దేవ్‌ బాబాకు ఎంపీ కేశినేని ఆహ్వానం

విజయవాడ (Vijayawada) ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) దిల్లీ విమానాశ్రయంలో మంగళవారం యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ను కలిశారు. విజయవాడ సాంస్కృతిక వైభవం దేశమంతా చాటి చెప్పేలా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్‌ గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రామ్‌దేవ్‌బాబాను ఎంపీ ఆహ్వానించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. విజయవాడ ఉత్సవ్‌ జరిగే 11 రోజుల్లో ఒక రోజు హాజరవుతానని రామ్‌దేవ్‌ బాబా చెప్పారని ఎంపీ తెలిపారు.

సోసైటీ ఫ‌ర్ వైబ్రెంట్ విజ‌య‌వాడ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ (AP) ప్రభుత్వ స‌హ‌కారంతో ద‌స‌రా ఉత్సవాల సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 22 నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు విజయవాడ ఉత్సవ్‌ నిర్వహించనున్నట్టు ఎంపీ కేశినేని తెలిపారు. ద‌స‌రా మహోత్సవాలకు మ‌రింత వన్నె త‌చ్చే విధంగా సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక‌త క‌లిసి ప‌ర్యాట‌కుల‌తో పాటు ప్రజలను అల‌రించే విధంగా విజ‌య‌వాడ ఉత్సవ్‌ ఉంటుంద‌ని వివ‌రించారు.

చంద్రబాబు అరెస్ట్‌ కు రెండేళ్ళు ! తండ్రి అరెస్ట్ పై లోకేశ్ భావోద్వేగ పోస్ట్ !

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని (CM Chandrababu) అప్పటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి నేటికి రెండు సంవత్సరాలైంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున, నా తండ్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్టు చేశారు. ఈ ఘటన మా కుటుంబానికి మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికే ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. ఆ క్షణం అనుభవించిన బాధ అలాగే ఉంది. మా సంకల్పం కూడా అలాగే ఉంది. ఆయన ధైర్యం, గౌరవం, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఆయనకున్న అచంచలమైన విశ్వాసం.. న్యాయం, సత్యం కోసం మా పోరాటానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి’ అని నారా లోకేష్ అన్నారు.

Also Read : State Election Commissioner: ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

Leave A Reply

Your Email Id will not be published!