Formula E Scam Case: ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో సంచలనం

ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో సంచలనం

Formula E Scam Case : ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మాజీమంత్రి కేటీఆర్ (KTR), ఐఏఎస్ అధికారి అరవింద్‌ కుమార్‌, ఇతర అధికారులు బీఎల్‌ఎన్ రెడ్డి, కిషన్‌రావు, ఎఫ్‌ఈవోలను ప్రాసిక్యూట్‌ చేసేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, గవర్నర్ అనుమతి అనంతరం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Formula E Scam Case Updates

కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా అనుమతి రాగానే వారిపై ఛార్జ్‌ షీట్ దాఖలు చేయనున్నారు ఏసీబీ అధికారులు. కాగా, ఇప్పటికే కేటీఆర్‌ను నాలుగు సార్లు అరవింద్ కుమార్‌ను ఐదుసార్లు విచారించారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో భారీగా అవినీతి జరిగినట్లు తేల్చారు. ఈ కేసులో క్విడ్‌ప్రోకో జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. తొమ్మిది నెలల పాటు పకడ్బందీగా ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. కేబినెట్‌ అనుమతి లేకుండానే ఎఫ్ఈవో కంపెనీకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో 19 డిసెంబర్‌ 2024న ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రూ.54.88 కోట్లకుపైగా నిధులు దారి మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఫార్ములా ఈ-కారు రేసు (Formula E Scam Case) కేసులో క్విడ్‌ప్రోకో జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు ఏసీబీ అధికారులు.

నేను లై డిటెక్టర్‌ టెస్టుకు సిద్ధం. రేవంత్‌ సిద్ధమా అంటూ కేటీఆర్‌ సవాల్

తనపై పెట్టిన ఫార్మాలా ఈ-కార్‌ రేసు (Formula E Scam Case) ఒక లొట్టపీస్‌ కేసని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ఇమేజ్‌ పెంచేందుకు ఆనాడు ఈ-కార్‌ రేస్‌ నిర్వహించామన్నారు. లొట్టపీస్‌ కేసులో ఎటువంటి చార్జ్‌షీటైనా వేసుకోమనండి, అందులో అవినీతే జరగలేదన్నారు. మంగళవారం ఫార్మాలా ఈ-కార్‌ రేస్‌ చార్జ్‌షీటు దాఖలుపై కేటీఆర్‌ స్పందించారు.

‘ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E Scam Case) లో అవినీతే జరగలేదు. ేను లైట్ డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం , రేవంత్ రెడ్డి సిద్ధమా?, దమ్ముంటే రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలి. రేవంత్‌ వస్తారా.. ఏసీబీ డీజీ వస్తారా.. లై డిటెక్టర్‌ సిద్ధం. ూ. 45 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశించింది నేనే. ఎక్కడా కూడా రూపాయి తారుమారు కాలేదు. ప్రాసిక్యూషన్‌, చార్జిషీట్‌, జైలు.. ఏదైనా చేసుకోండి.. నేను సిద్ధం’ అని కేటీఆర్ సవాల్‌ చేశారు.

కాగా, అంతకుముందు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కేటీఆర్‌.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ‘కొందరు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేదని దుస్థితిలో ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. గద్వాల్‌ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ మీటింగ్‌లకు ఎందుకు రావడం లేదు?.కాంగ్రెస్‌ కండువా వేసుకుని సిగ్గులేకుండా బీఆర్‌ఎస్‌లో ఉన్నానంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటువేయాలి’అని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తాం – కవిత

మాజీ సీఎం కేసీఆర్‌ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగానూ అంజలి ఘటించారు.

అనంతరం కవిత మాట్లాడుతూ… ‘‘ఉన్నతమైన ఆశయాలతో అడుగు వేయాలని ఆలోచిస్తున్నాం. ఉన్నతమైన లక్ష్యం దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయి. సామాజిక తెలంగాణ సాధించే వరకు జాగృతి కార్యకర్తలు విశ్రమించబోరు. సామాజిక తెలంగాణ సాధన కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం. కేసీఆర్‌ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తాం. కాళోజీ స్ఫూర్తితోనే అందరమూ పని చేశాం.. పని చేస్తాం. ఐలమ్మ స్ఫూర్తితో అందరూ విజృంభించి అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అన్నారు.

Also Read : PM Narendra Modi: హిమాచల్‌ ప్రదేశ్‌ లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే

Leave A Reply

Your Email Id will not be published!