IPS Transfers: ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకం
ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకం
IPS Transfers : ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా… మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
IPS Transfers – కొత్త ఎస్పీలుగా నియామకం అయిన ఐపీఎస్ లు వీరే
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ- రాహుల్ మీనా
బాపట్ల- ఉమామహేశ్వర్
కృష్ణా- విద్యాసాగర్ నాయుడు
నెల్లూరు- అజితా వేజెండ్ల
తిరుపతి- సుబ్బరాయుడు
అన్నమయ్య- ధీరజ్ కునుగిలి
కడప- నచికేత్
గుంటూరు- వకుల్ జిందాల్
నంద్యాల- సునీల్ షెరాన్
విజయనగరం- ఏఆర్ దామోదర్
పల్నాడు- డి.కృష్ణారావు
ప్రకాశం- హర్షవర్ధన్ రాజు
చిత్తూరు- తుషార్ డూడి
శ్రీసత్యసాయి- సతీష్‌కుమార్
IPS Transfers – సోషల్ మీడియాలో రెచ్చిపోయే వారి తాట తీయండి – ఎస్పీలకు చంద్రబాబు హుకుం
రాజకీయ ముసుగులో ఎవరు నేరాలకు పాల్పడినా ఊపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మరోసారి స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని చట్టప్రకారం తగిన విధంగా శిక్షించాలని ఆయన అన్ని జిల్లాల ఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇందుకు వైఎస్ వివేకానందరెడ్డి, సింగయ్య మరణాలను కేస్ స్టడీలుగా చూడాలంటూ ఆదేశించారు. శనివారం 26 జిల్లాలకు నూతన ఎస్పీలను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు… నేరస్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వారికి వివరించారు. ఈ మేరకు ఎస్పీలకు పలు కీలక సూచనలు చేశారు.
ఏపీ (AP) ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పాటిస్తూనే అసాంఘిక శక్తులు భయపడేలా పని చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వివరించారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టొద్దని హుకుం జారీ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకే ప్రథమ ప్రాధాన్యమని… పెట్టుబడులకు అదే కీలకమన్నారు ముఖ్యమంత్రి. ముఖ్యంగా సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాల్సి అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇన్వెస్టిగేషన్లో టెక్నాలజీతో బెస్ట్ రిజల్ట్ సాధించొచ్చని.. రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ విధానాలు, ఆలోచనలు, లా అండ్ ఆర్డర్ సహా పలు అంశాలపై ఎస్పీలతో చర్చించారు చంద్రబాబు. ఈ సమావేశంలో ఆయా జిల్లాల నుంచి ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
అన్ని జిల్లాల ఎస్పీలతో సమావేశం అనంతరం మంత్రులు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారితోనూ పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా ఈనెల 15, 16 తేదీల్లో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ అజెండా, నిర్వహణపై చర్చించారు ముఖ్యమంత్రి. అధికారులను పెద్దఎత్తున బదిలీ చేస్తున్నందున పాలనలో మరింత వేగం పెంచే ప్రయత్నాలు చేయాలన్నారు. మంత్రులు మరింత సమర్థమంతంగా, ప్రభావవంతంగా పని చేయాలని ఆదేశించారు. సమస్యలు, సవాళ్లు దాటి సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నామని.. ఇప్పుడు అదే రీతిలో పాలనలో వేగం పెరగాలంటూ మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు హుకుం జారీ చేశారు.
Also Read : Kinjarapu Rammohan Naidu: ఉత్తరాంధ్రకు భోగాపురం విమానాశ్రయం ఆయువుపట్టు – కేంద్ర మంత్రి
