Speaker Ayyannapatrudu: జగన్‌ పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆశక్తికర వ్యాఖ్యలు

జగన్‌ పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆశక్తికర వ్యాఖ్యలు

Speaker Ayyannapatrudu : కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Speaker Ayyannapatrudu) ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు. అసెంబ్లీకి కనీసం 50 రోజులైనా హాజరు కావాలనే నిబంధన ఎమ్మెల్యేలకు తప్పనిసరి చేయాలన్నారు. అంతేకాకుండా అసెంబ్లీకు హాజరుకాకుండా ప్రభుత్వం గురించి జగన్ మాట్లాడటం సరికాదన్నారు. తిరుపతి వేదికగా ఆదివారం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

Speaker Ayyannapatrudu Slams YSRCP

ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు (Speaker Ayyannapatrudu) మాట్లాడుతూ… ‘‘ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యలు పరిష్కరించడానికే. ఉద్యోగాలకు రాకపోతే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. చిరుద్యోగులు సైతం ‘నో వర్క్‌ – నో పే’ విధానం అనుసరిస్తున్నారు. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభ స్పీకర్‌ మార్గదర్శకాలు ఇవ్వాలి. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 45 రోజులు.. వాటికి కూడా రాకపోతే ఎలా?’’ అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. తిరుపతి లాంటి మహా పుణ్యక్షేత్రంలో మహిళా సాధికారిక సదస్సు జరగడం మంచి పరిణామమని ఉద్ఘాటించారు. మహిళలకు తండ్రి ఆస్తిలో సగం వాటా ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌నేనని నొక్కిచెప్పారు. గతంలో ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు మహిళల ఆస్తి హక్కు గురించి చట్టం చేశారని గుర్తుచేశారు అయ్యన్నపాత్రుడు.

ఉద్యోగాల్లో మహిళలకు ఎన్టీఆర్ రిజర్వేషన్ తీసుకువచ్చారని ఉద్ఘాటించారు. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలను బలోపేతం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని నొక్కిచెప్పారు. ఒక మహిళను అసెంబ్లీకి స్పీకర్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్.. మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శప్రాయమని తెలిపారు. తిరుపతిలో మహిళా యూనివర్సిటీని పెట్టింది కూడా ఎన్టీఆరేనని గుర్తుచేశారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్‌గా వంగలపూడి అనితను పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు సీఎం చంద్రబాబు స్థానం కల్పించారని ఉద్ఘాటించారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ విషయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.

Also Read : Jubilee Hills: జూబ్లీహిల్స్ టిక్కెట్టు బరిలో నేను ఉన్నా – మాజీ ఎంపీ

Leave A Reply

Your Email Id will not be published!