Dimple Yadav: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ! ప్రయాణికుల్లో డింపుల్ యాదవ్ !
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ! ప్రయాణికుల్లో డింపుల్ యాదవ్ !
Dimple Yadav : ఉత్తరప్రదేశ్‌లోని లక్నో విమానాశ్రయంలో ఆదివారం ఊహించని ఘటన చోటుచేసుకుంది. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనితో విమానం పైకి ఎగురలేక రన్‌వే పైనే ఆగిపోయింది. దీనితో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి టేకాఫ్‌ను నిలిపివేశారు. ఆ సమయంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ సహా 151 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
Dimple Yadav – Indigo Flight
టేకాఫ్ నిలిపివేసిన అనంతరం ప్రయాణికులను కిందకు దించి వేరే విమానంలో ఢిల్లీకి పంపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకూ ఇండిగో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు ఈనెల 6న సైతం ఇలాంటి ఘటనే ఇండిగో విమానానికి ఎదురైంది. అబూదబి వెళ్లాల్సిన ఇండిగో విమానం టెకాఫ్ అయిన కొద్ది సేపట్లోనే సాంకేతిక లోపం తలెత్తడంతో కొచ్చి విమానాశ్రయానికి తిరిగి వచ్చింది.
Also Read : Minister Nitin Gadkari: నా బ్రెయిన్ విలువ రూ.200 కోట్లు – కేంద్ర మంత్రి గడ్కరీ
