Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర
తిరుమల శ్రీవారి సేవలో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర
Tirumala : భారత్ పర్యటనలో ఉన్న మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత తిరుమల చేరుకున్న ప్రధాని దంపతులకు మహాద్వారం వద్ద టీటీడీ (Tirumala) ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఏకే సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ప్రధాని వెంట ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా… మంత్రి ఆనం, ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో సింఘాల్ ఆ దంపతులకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
సెప్టెంబర్ 9న భారత్ పర్యటనకు విచ్చేసిన మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర… సెప్టెంబర్ 11న ప్రధాని నరేంద్ర మోదీతో వారణాసిలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత సంతతి ప్రజలు అధికంగా ఉండే మారిషస్‌కు మన దేశం రూ.5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దీంతో పాటు తీర ప్రాంత భద్రత వంటి 7 కీలక ఒప్పందాలను ఆ దేశంతో కుదుర్చుకుంది. భారత్‌లో నవీన్ చంద్ర పర్యటన ఈ నెల 16తో ముగియనుంది.
Tirumala – శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు మాధవి రెడ్డి, భూమా అఖిలప్రియ, ఎంపీ డీకే అరుణ, ఎంపీ రవిచంద్ర, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా… స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వారు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.
Also Read : CM Chandrababu: డబుల్ డిజిట్ గ్రోత్ ప్రభుత్వ లక్ష్యం – కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
