Minister Hardeep Puri : E20పై కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఆశక్తికర వ్యాఖ్యలు

E20పై కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఆశక్తికర వ్యాఖ్యలు

Hardeep Puri : 20శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ (E20)) సురక్షితం కాదంటూ గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. బయో ఇంధనాల వల్ల ఆటోమొబైల్ ఇంజిన్లు దెబ్బతింటాయని పలువురు చేస్తున్న ప్రచారాలను కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి (Hardeep Puri) కొట్టిపారేశారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలపడం వల్ల వాహనాల మైలేజీ తగ్గుతోందనేది చెత్త వాదన అన్నారు. ఈ20(E20) ఇంధనం పర్యావరణపరంగా ఉపయోగించడానికి సురక్షితమని పేర్కొన్నారు. అయితే దీర్ఘకాలంలో పాత వాహనాల్లో గ్యాస్కెట్లు, ఇంధన రబ్బరు గొట్టాలు, పైపులను మార్చాల్సి రావచ్చని.. అది సాధారణమైన విషయమేనని పేర్కొన్నారు.

Union Minister Hardeep Puri Comments on E20

పలువురు ఉద్దేశపూర్వకంగానే ఇథనాల్‌తో సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రజల్లో తప్పుడు భయాలను సృష్టిస్తున్నారని హర్దీప్‌ సింగ్‌ పురి పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనాల ప్రకారం.. భారత్‌లో ఇంధన డిమాండ్ రాబోయే రెండు దశాబ్దాలలో ప్రపంచ దేశాల్లో ఉన్న దానికంటే మూడు రెట్లు పెరుగుతుందన్నారు. అటువంటి సమయంలో ఇథనాల్‌ ప్రధాన ఇంధన వనరుగా మారే అవకాశం ఉందన్నారు. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ కొంతమేర తక్కువ ఉండడంతో మైలేజీలో తగ్గుదల ఉన్నప్పటికీ.. అది అతి స్వల్పమేనని ఆ శాఖ వెల్లడించింది.

ఇ20 ఇంధనం పాత వాహనాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందా..? డ్రైవింగ్‌ను దెబ్బతీస్తుందా..? అని వాహనదారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇథనాల్‌ను కలిపిన పెట్రోల్‌ను వినియోగించడం వల్ల మైలేజీ సమస్యలు వస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ ఇప్పటికే వివరణాత్మక స్పష్టత ఇచ్చింది. ఇథనాల్ కలిసిన పెట్రోల్‌ తో ఎలాంటి ఇంజిన్‌ సమస్యలు తలెత్తవని వెల్లడించింది. ఇథనాల్‌ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని వ్యాఖ్యానించింది. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సైతం పలుమార్లు ఈ విషయంపై స్పష్టత నిచ్చారు.

Also Read : Disha Patani : దిశా పటానీ ఇంటిముందు కాల్పుల ఘటన నిందితుల హతం

Leave A Reply

Your Email Id will not be published!