Samir Modi: అత్యాచారం కేసులో లలిత్ మోదీ సోదరుడు అరెస్టు
అత్యాచారం కేసులో లలిత్ మోదీ సోదరుడు అరెస్టు
Samir Modi : ప్రముఖ వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ సోదరుడు సమీర్ మోదీను (Samir Modi) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసారు. అత్యాచారం కేసులో గురువారం సాయంత్రం ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు వెళ్తున్న సమయంలో సమీర్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సమీర్‌తో గతంలో సహజీవనం చేసిన మహిళ ఫిర్యాదు మేరకే ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.
Samir Modi Arrested
ఓ మహిళ 5 రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించి సమీర్ మోదీపై (Samir Modi) ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు.. సమీర్‌పై సౌత్ ఈస్ట్ ఢిల్లీలో అత్యాచారం, బెదిరింపులు తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అరెస్టు చేసిన కోర్టు ముందు హాజరుపరచగా… సమీర్‌కు ఒకరోజు జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు తెలిసింది. సెప్టెంబర్ 19న మరోసారి కోర్టు ముందు హాజరు పరచనున్నారు. ఈ కేసును సెటిల్ చేసుకునేందుకు సదరు మహిళ రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే, ఈ వ్యవహారంపై దిల్లీ పోలీసుల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఐపీఎల్‌కు బాస్‌గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడని లలిత్ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతో 2010లో లండన్‌కు పారిపోయిన అతడు… అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
సమీర్ గతేడాదీ ఇలాగే వార్తల్లో నిలిచాడు. తన తల్లి బినా మోదీతో వారసత్వ వివాదం కేసులో పోలీసులను ఆశ్రయించాడు. తన తల్లి నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలని కోరాడు. సమీర్ తండ్రి కేకే మోదీ 2019లో మరణించారు. ఆ తర్వాత రూ. 11,000 కోట్ల వారసత్వ ఆస్తి పంపిణీ విషయంలో వారి కుటుంబంలో అప్పట్లో గొడవలు తలెత్తాయి. తన తండ్రి అమలు చేసిన ట్రస్ట్ డీడ్ ప్రకారం.. ఆస్తులు, డబ్బుల పంపిణీ విషయంలో తన తల్లి విఫలమయ్యారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మోదీకేర్ అనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వ్యవస్థాపకుడైన సమీర్.. ప్రస్తుతం ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
Also Read : CDS Anil Chauhan: బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’ – సీడీఎస్ అనిల్ చౌహాన్
