IndiGo : ముంబై-ఫుకేత్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. దీనితో 6E 1089 ఇండిగో విమానాన్ని శుక్రవారంనాడు చెన్నైకి దారిమళ్లించారు. విమానంలోని లావెట్రీలో బాంబు బెదిరింపు మెసేజ్ కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 3.33 గంటలకు విమానం టేకాఫ్ తీసుకుని బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా బెదిరింపు మెసేజ్ కనిపించింది. దీనితో విమానాన్ని చెన్నైకి మళ్లించాలని పైలట్లు నిర్ణయించారు. రాత్రి 7.16 గంటలకు సురక్షితంగా చెన్నై విమానాశ్రయానికి ఇండిగో విమానం చేరింది.
IndiGo Flight Gets Bomb Threats
భద్రతా ముప్పును గుర్తించడంతో విమానాన్ని చెన్నైకి మళ్లించామని, ప్రోటాకాల్ ప్రకారం సమాచారాన్ని సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేసి చెన్నైలో భద్రతా తనిఖీలు జరిపినట్టు ఇండిగో ప్రతినిధి తెలిపారు. ఫుకెట్ విమానాశ్రయంలో నైట్ కర్ఫ్యూ ఉన్నందున విమాన జర్నీని అర్ధరాత్రికి రీషెడ్యూల్ చేస్తామని చెప్పారు. ప్రయాణికుల ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రిఫ్రెష్మెంట్లు కల్పిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని ఇండిగో ప్రతినిధి చెప్పారు.
Also Read : Election Commission: 474 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసిన ఈసీ
