Minister Jaishankar: ఉగ్రవాదంపై సహనం చూపొద్దు ప్రపంచ దేశాలకు జైశంకర్ సూచన
ఉగ్రవాదంపై సహనం చూపొద్దు ప్రపంచ దేశాలకు జైశంకర్ సూచన
Minister Jaishankar : ఉగ్రవాదంపై ప్రపంచం ఏ మాత్రం సహనం చూపకూడదని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ (Minister Jaishankar) పేర్కొన్నారు. న్యూయార్క్‌లో జరిగిన బీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదుల మధ్య విస్తృత నెట్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకునేవారే అంతర్జాతీయ సమాజానికి పెద్ద సేవ చేస్తారని జైశంకర్ (Minister Jaishankar) వివరించారు. ఆర్థిక అస్థిరత్వం, ఘర్షణలు, ఉగ్రవాదం వంటి సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని, ఐక్య రాజ్య సమితి వంటి ప్రపంచ సంస్థలు సంక్షోభాలను పరిష్కరించడంలో విఫలం అవుతున్నాయని విమర్శించారు. ఐరాసలో సంస్కరణల అవసరం ఎప్పుడూ లేనంతగా ఉందని, ప్రపంచ పాలనను మరింత నిర్మాణాత్మకంగా, జవాబుదారీగా మార్చాలని పిలుపునిచ్చారు. బి20 సభ్య దేశాలకు ప్రపంచ స్థిరత్వాన్ని బలోపేతం చేసే బాధ్యత ఉందని, చర్చల ద్వారా ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
Minister Jaishankar – చాలా దేశాల్లో అవసరమైనంత శ్రామిక శక్తి లేదు
ప్రపంచ దేశాలకు అంతర్జాతీయ శ్రామికశక్తి అవసరం ఉందని.. దాని నుంచి అవి తప్పించుకోలేవని ఎస్.జైశంకర్ (Minister Jaishankar) పేర్కొన్నారు. చాలా దేశాల్లో జనాభా పరిస్థితుల కారణంగా డిమాండ్‌ను కూడా పూర్తి చేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అబ్జర్వర్ రీసెర్చి ఫౌండేషన్ నిర్వహించిన ‘ఎట్ ది ఆర్ట్ ఆఫ్ డెవలప్మెంట్: ఎయిడ్, ట్రేడ్, అండ్ డెవలప్మెంట్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ శాంతి, ప్రపంచ అభివృద్ధి మధ్య సంబంధం ఉందని, అయితే ఇటీవలి కాలంలో రెండూ ఏకకాలంలో క్షీణించాయని, ఫలితంగా ముఖ్యంగా దక్షిణార్థగోళ దేశాలకు నష్టం జరిగిందని ఆయన తెలిపారు. ఉక్రెయిన్, గాజా యుద్ధాలు ప్రపంచ ఇంధనం, ఆహారం, ఎరువుల భద్రతను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. వాటి సరఫరా, లాజిస్టిక్స్ల రూపంలో దేశాలపై ఒత్తిడి పెరిగిందని జైశంకర్ (Minister Jaishankar) ఆందోళన వ్యక్తం చేశారు.
Minister Jaishankar – కశ్మీర్ ప్రజలకు మా మద్దతు పాక్ ప్రధాని
జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితికి ముమ్మాటికీ భారత ప్రభుత్వమే కారణ మని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ విమర్శించారు. నిష్పక్షపాతంగా ప్రజాభి ప్రాయ సేకరణ జరగాలని జమ్మూకశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నా రని, వారికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. స్వయం పాలన వారి ప్రాథమిక హక్కు అని తెలిపారు. సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఈ ఒప్పందంలో ఎలాంటి ఉల్లంఘన జరిగినా అది తమపై యుద్ధంగా పరిగణిస్తామని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు.
నాలుగు రోజులపాటు ఘర్షణ జరిగిందని, పాక్ వైమానిక దళం దాడుల్లో భారత్‌కు చెందిన ఏడు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. అన్ని కీలక అంశాలపై భారత్‌తో సమగ్ర చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. అన్ని రకాల వివాదాలకు చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే శాంతియుత పరిష్కారం కనిపెట్టాలన్నది తమ విధానమని పేర్కొన్నారు. భారత్‌తో సంప్రదింపులకు నిజాయితీతో కృషి చేస్తున్నామని చెప్పారు.
నోబెల్ బహుమతికి ట్రంప్ పేరు ప్రతిపాదిస్తున్నాం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై షెహబాజ్ షరీఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. దక్షిణాసియాలో భారీ యుద్ధం ఆగిందంటే అదంతా ట్రంప్ చలవేనని తేల్చిచెప్పారు. భారత్, పాక్‌ల మధ్య శాంతికోసం ట్రంప్ ఎంతగానో చొరవ తీసుకున్నారని వెల్లడించారు. ఆయన వల్లే యుద్ధం ఆగిపోయిందన్నారు. ట్రంప్ సేవలకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ పేరును ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారికంగా ట్రంప్ పేరును నామినేట్ చేస్తోందని తెలియజేశారు.
అటార్నీ జనరల్‌గా వెంకటరమణి పునర్నియామకం
భారత అటార్నీ జనరల్‌గా ఆర్.వెంకటరమణి తిరిగి నియమితులయ్యారు. దీంతో ఈ నెల 30న ముగియాల్సిన ఆయన పదవీకాలం మరో రెండేళ్ల పాటు కొనసాగనుంది. ఆయన 2022లో కె.కె.వేణుగోపాల్ స్థానంలో అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. 1950 ఏప్రిల్ 13న పుదుచ్చేరిలో జన్మించిన వెంకటరమణి 1977లో న్యాయవాదిగా తమిళనాడు బార్ కౌన్సిల్లో నమోదయ్యారు. 1979లో తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. 1997లో ఆయనకు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేటుగా గుర్తింపునిచ్చింది. వెంకటరమణి 2010 నుంచి 2013 వరకూ లా కమిషన్ సభ్యునిగా పనిచేశారు. రాజ్యాంగంలోని 76(1) అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు అటార్నీ జరనరల్ను భారత రాష్ట్రపతి నియమిస్తారు.
Also Read : Indian Army Chief: పాక్ కు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్
