Delhi Court: సిగరెట్‌ తాగుతూ అర్ధనగ్నంగా కోర్టు విచారణలో ప్రత్యక్షమైన వ్యక్తి

సిగరెట్‌ తాగుతూ అర్ధనగ్నంగా కోర్టు విచారణలో ప్రత్యక్షమైన వ్యక్తి

Delhi Court : కోర్టు విచారణ సమయంలో ఓ వ్యక్తి అర్ధనగ్నంగా… సిగరెట్‌ తాగుతూ ఆన్‌లైన్‌లోకి వచ్చిన ఘటన తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 16, 17తేదీల్లో ఓ కేసులో దిల్లీ కోర్టు (Delhi Court) ఆన్‌లైన్‌ విచారణను చేపట్టింది. విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి లోదుస్తుల్లో అర్ధనగ్నంగా వీడియో కాల్‌లో లాగిన్‌ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ సమయంలో అతడు సిగరెట్‌, మందు తాగుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ చర్యలను తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం అతడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించింది. దీనితో అకిబ్ అఖ్లక్ అనే యూజర్‌ ఐడీతో లాగిన్‌ అయిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లొకేషన్‌ ఆధారంగా నిందితుడిని న్యూదిల్లీలోని గోకుల్‌పురికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్‌గా గుర్తించారు.

Delhi Court – A Man Appeared

అతడు తరచూ లొకేషన్లు మారుస్తుండడం వల్ల నిందితుడిని గుర్తించడంలో ఆలస్యమైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి… కోర్టు విచారణలోకి లాగిన్‌ అయ్యేందుకు ఉపయోగించిన మొబైల్ ఫోన్, సిమ్ కార్డ్, రౌటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అతడికి అనుమతిలేని ఆన్‌లైన్‌ విచారణకు కావాల్సిన లాగిన్‌ వివరాలను ఎలా పొందాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇమ్రాన్‌పై దిల్లీ వ్యాప్తంగా 50కి పైగా దోపిడీ, ఇతర నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కోర్టుకు సంబంధించిన విచారణలు జరిగే వెబ్‌ఎక్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ గురించి తన స్నేహితుడు చెప్పడంతో ఆన్‌లైన్‌ విచారణలు ఎలా చేపడతారో చూడడానికి అందులో లాగిన్‌ అయినట్లు నిందితుడు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Also Read : Nirav Modi: నవంబరు 23న భారత్‌కు నీరవ్‌మోదీ అప్పగింత ?

Leave A Reply

Your Email Id will not be published!