మార్ష్ విధ్వంసం చెన్నై కింగ్స్ ప‌రాజ‌యం

ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే చెమ‌టోడ్చాల్సిందే

ల‌క్నో : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఊహించ‌ని రీతిలో దెబ్బ కొట్టింది రిష‌బ్ పంత్ సార‌థ్యంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. మొన్న‌టికి మొన్న సీఎస్కే చేతిలో ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంది. ఏకంగా 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది ల‌క్నో. ఈసారి సీన్ మారింది. పంత్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ల‌క్నో బౌల‌ర్ల దెబ్బ‌కు చెన్నై బ్యాట‌ర్లు నానా తంటాలు ప‌డ్డారు. ఫుల్ ఫామ్ తో ఉన్న సంజు శాంస‌న్ తీవ్ర నిరాశ‌కు గురి చేశాడు. ఇక ఎప్ప‌టి లాగే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ చెత్త షాట్ ఆడ‌బోయి వికెట్ పారేసుకున్నాడు. ఇక టోర్నీలో అనూహ్యంగా విజ‌యాలు సాధిస్తూ వ‌స్తున్న సీఎస్కే పాలిట శాపంగా మారాడు మిచెల్ మార్ష్. త‌ను ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. నిర్ణీత 20 ఓవర్ల‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇచ్చిన 188 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

టోర్నీ లో వ‌రుస ఓట‌ముల‌తో కుంగి పోయిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కు ఈ గెలుపు ఊర‌ట ఇచ్చేలా చేసింది. ప‌రుపు పోకుండా కాపాడేలా చేసింది. ఈ ఓట‌మితో ప్లే ఆఫ్స్ చేరుకోవ‌డం చెన్నైకి మ‌రింత క‌ష్టంగా మారింది. ల‌క్నో జ‌ట్టులో మార్ష్ ఆకాశమే హ‌ద్దుగా చెల‌రేగాడు. త‌ను కేవ‌లం 38 బంతులు మాత్ర‌మే ఎఎదుర్కొని 9 ఫోర్లు 7 సిక్సుల‌తో విరుచుకుప‌డ్డాడు. 90 ప‌రుగులు చేశాడు. కేవ‌లం 16.4 ఓవర్ల‌లోనే పూర్తి చేసింది. ఇక చెన్నై కింగ్స్ జ‌ట్టును కార్తీక్ శ‌ర్మ , శివ‌మ్ దూబే ఆదుకున్నారు. లేక పోతే 100 ప‌రుగులే చేసి ఉండేది. శ‌ర్మ 42 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో 71 ర‌న్స్ చేశాడు. శివ‌మ్ దూబే 16 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 32 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

Leave A Reply

Your Email Id will not be published!