మోదీ మ‌న్ కీ బాత్ లో ఏపీ మామిడి ప్ర‌స్తావ‌న

ఆ పండ్ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే

న్యూఢిల్లీ : ఏపీ మామిడి పండ్ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఆయ‌న ప్ర‌తి నెలా మ‌న్ కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ వేదిక‌గా నిర్వ‌హించిన మ‌న్ కీ బాత్ లో మామిడి పండ్ల గురించి ప్ర‌స్తావించారు. | దక్షిణ భారతదేశానికి వెళితే… అక్కడ బంగినపల్లి, తోతాపురి, నీలం, మల్గోవా, బెంగాల్‌కు చెందిన హిమ్‌సాగర్, ఒడిశా , ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సువర్ణరేఖ రకాలు కనిపిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, ప్రాంతం మారే కొద్దీ మామిడి పండు ఆకారం, రంగు, రుచి కూడా మారుతుంటాయ‌ని పేర్కొన్నారు.

ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ‘మన్ కీ బాత్’ 134వ సంచికలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘సువర్ణరేఖ’ మామిడి రకం గొప్ప‌ద‌నాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంద‌న్నారు. తన ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ, వేసవి రాగానే ప్రతి ఇంట్లోనూ మరో చర్చ మొదలవుతుందని, అదే మామిడి పండ్ల గురించిన చర్చ అని పేర్కొన్నారు. మామిడి పండ్లు అందరూ చర్చించుకునే ఒక సాధారణ అంశం. వేసవిలో మామిడి పండ్ల ప్రస్తావన లేని ఇల్లు భారతదేశంలో దాదాపు ఉండదనే చెప్పాల‌ని అన్నారు. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన మామిడి రకం, దానికి సంబంధించిన ప్రత్యేక రుచి, సువాసన ఉంటాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర , కొంకణ్ ప్రాంతాల ‘హాపుస్’ , గుజరాత్ కు చెందిన కేస‌రి, యూపీకి చెందిన ‘దసహరి’, అలాగే నా ‘కాశీ’కి చెందిన ‘లంగ్రా’ రకాలు ఇందుకు ఉదాహరణలు అని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!