మృతుల కుటుంబాల‌కు రూ. 25 లక్ష‌లు

ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. విశాప‌ట్నం జిల్లాలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో ఫోక‌స్ పెట్టాయి. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించింది స‌ర్కార్. గాయ ప‌డిన కుటుంబాల‌కు త‌క్ష‌ణ‌మే రూ. 10 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ ఘ‌ట‌న‌పై దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

మ‌రో వైపు కేంద్ర మంత్రులు కుమార స్వామి, శ్రీ‌నివాస్ వ‌ర్మ‌, రాష్ట్ర మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్న‌తాధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని ఆదేశించారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని సూచించారు. మంగ‌ళ‌వారం సీఎం చంద్ర‌బాబుతో పాటు మంత్రి నారా లోకేష్ విశాఖ‌కు రానున్నారు. వాస్త‌వానికి వాళ తిరుప‌తిలో బ‌హిరంగ స‌భ జ‌ర‌గాల్సి ఉంది. వైజాగ్ ప్ర‌మాద ఘ‌ట‌నతో వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. మ‌రో వైపు కేంద్ర మంత్రి కుమార స్వామి ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు ఆదేశాలు ఇస్తూ కార్మికుల్లో మ‌నో నిబ్బ‌రం క‌లిగించేలా చేస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!