51,952 మంది నేతన్నలకు ఆర్థిక లబ్ధి : ఎస్. స‌విత

50 ఏళ్లు నిండిన చేనేతలకు రూ.4 వేల పెన్షన్లు అందజేత‌

అమరావతి : రాష్ట్రంలో చేనేత కళాకారులు గౌరవ ప్రదమైన జీవనం సాగించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని, ఇందులో భాగంగా నేతన్నలకు ఆర్థిక దన్ను కలిగేలా నేతన్న సేవ పథకానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. నేతన్న సేవ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 51,952 మంది నేతన్నలకు ఆర్థిక లబ్ధి కలిగేలా ఏటా రూ.25 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం బడ్జెట్ లో రూ.250 కోట్లు కేటాయించామని, వచ్చే నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు ఎస్. స‌విత‌. రాష్ట్రం చేనేత రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతిని ఈ నెల 26న రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నామ‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించేలా కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పిందన్నారు. నేతన్న సేవ పథకానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఈ మేరకు కేబినెట్ లో ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఆగస్టు ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు ఎస్. స‌విత‌. ఈ పథకం ద్వారా ఏటా 51,952 మంది నేతన్నలకు రూ.25 వేల ఆర్థిక సాయం అందజేయనున్న‌ట్లు వెల్ల‌డించారు. చేనేతలకు ఆర్థిక దన్ను కలిగించేలా నేతన్న సేవ పథకాన్ని శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున నేత‌న్న‌ల అభివృద్ది కోసం ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు ఎస్. స‌విత‌.

Leave A Reply

Your Email Id will not be published!