హైదరాబాద్ : వినోద రంగంలో అత్యంత జనాదరణ పొందిన కార్యక్రమం బిగ్ బాస్ రియాల్టీ షో. స్టార్ తెలుగు మా టివిలో ఇది ప్రసారం అవుతోంది. తాజాగా ఇందుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ప్రముఖ నటుడు, యాంకర్ గా పేరు పొందిన అక్కినేని నాగార్జున బిగ్ బాస్ కు హోస్ట్ గా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ కు మారుస్తారని గతంలో ప్రచారం జరిగినప్పటికీ నాగ్ మాత్రమే దీనిని మరింత రసవత్తరంగా , జనరంజకంగా మార్చడంలో తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు నాగార్జున. ఇక బిగ్ బాస్ షో కు సంబంధించి ఈసారి 10వ సీజన్ కావడం విశేషం. కంటిన్యూగా భారీ ఎత్తున ఆదాయం సమకూరుతోంది ఆయా సంస్థల నుంచి ప్రకటనల రూపంలో. మరో వైపు అగ్ర నటుడిగా పేరు పొందిన, హిందూపురం ఎమ్మెల్య నందమూరి బాలకృష్ణ కూడా యాక్టర్ గా, యాంకర్ గా అవతారం ఎత్తారు. ఆయన కూడా సక్సెస్ అయ్యారు.
మరో వైపు బిగ్ బాస్ నుంచి కీలక అప్ డేట్ వచ్చేసింది. బిగ్ బాస్ తెలుగు షోకు సంబంధించి పదవ సీజన్‌ను పురస్కరించుకుని, పది దైవిక అవతారాలను సూచించే ‘దశావతారం’ థీమ్‌ను తాజా ప్రోమో వెల్లడించింది. అక్కినేని నాగార్జున ఈ ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’కు హోస్ట్‌గా తిరిగి రానున్నారు. షో నిర్వాహకులు రాబోయే సీజన్ కోసం ఒక కొత్త ప్రోమోను విడుదల చేశారు, అయితే అధికారిక ప్రసార తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇంతలో, సెట్ల నుండి లీక్ అయిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య విస్తృతంగా షేర్ అవుతున్నాయి. షో ప్రారంభానికి ముందే పోటీదారుల గురించి రకరకాల ఊహాగానాలు రావడం ప్రారంభం అయ్యాయి.
ఇందులో ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో దీపిక, ఉప్పల్ బాలు, కళ్యాణ్, పల్లవి, వర్ష , హరిత వంటి వారి పేర్లు రాబోయే సీజన్ పోటీదారులుగా వినిపిస్తున్నాయి.
