ముంబై : ఎన్సీపీ (ఎస్పీ) పార్టీకి సంబంధించిన ఎంపీ సుప్రియా సూలే సంచలన వ్యాఖ్యలు చేశారు . ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయన్న వార్తలపై స్పందించారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది వాస్తవమేనని ఒప్పుకున్నారు. తాజాగా సుప్రియా సూలే చేసిన కామెంట్స్ మరాఠా రాజకీయాలలో కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా గతంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారే. ఆ తర్వాత తను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చింది నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఒకప్పుడు మరాఠాలో కీలకమైన రాజకీయ నాయకుడిగా పేరు పొందారు. బీజేపీ ఆడిన నాటకంలో , వ్యూహంలో తను జీరో అయ్యాడు. చివరకు భారత దేశంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేస్తూ వస్తున్నారు ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర మంత్రి అమిత్ షా.
కాంగ్రెస్ కూటమి నుంచి ఆవిర్భవించిన పార్టీలను తిరిగి చేరమని ఆహ్వానించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు సుప్రియా సూలే. దీనిపై తమ పార్టీలో చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు ఎన్సీపీ ఎస్పీ ఎంపీ . అయితే ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు దారి తీయడంతో ఉన్నట్టుండి సుప్రియా సూలే తీవ్రంగా స్పందించారు. సమావేశంలో జరిగిన విషయాలన్నీ అభూత కల్పనలేనని, అబద్దాలేనంటూ , సత్య దూరమని ఖండించారు సుప్రియా సూలే.
