హైదరాబాద్ : హైదరాబాద్ కు చెందిన ప్రముఖ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ హనుమ విహారి గతంలో ఎన్నడూ లేనంతగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీపై, ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోమవారం ప్రముఖ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఏకి పారేశాడు. సంలన వ్యాఖ్యలు చేశాడు. తన వల్ల భారత జట్టుకు ఎలాంటి ఉపయోగం కలగడం లేదన్నారు. ఎంతో మంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నారని, కొందరిని ఇప్పటి వరకు ఎలాంటి పర్ ఫార్మెన్స్ లేక పోయినా జట్టులోకి ఎందుకు తీసుకున్నాడని ప్రశ్నించాడు హనుమ విహారి. ఇంగ్లాండ్ , ఐర్లాండ్ జట్లపై ఓటమి తర్వాత గౌతమ్ గంభీర్‌పై హనుమ విహారి తీవ్ర విమర్శలు చేయడం కలకలం రేపింది. క్రికెట్ వర్గాలలో తీవ్ర చర్చకు దారి తీసింది. గౌతమ్ గంభీర్‌కు కొంతమందికి ఇష్టమైన ఆటగాళ్లు ఉన్నారు, వారిని జట్టులోకి తీసుకుని ఆడించాలని ఆయన కోరుకుంటున్నారని మండిపడ్డారు.
జట్టులో చేర్చిన ఈ ఆటగాళ్ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉన్నట్లు నాకు అనిపించడం లేదని పేర్కొన్నాడు హనుమ విహారి. విచిత్రం ఏమిటంటే కొంతమంది ఆటగాళ్లు అసలు జట్టులో ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నాడు. దూబే బౌలింగ్ చేయడు, ఫీల్డింగ్ సరిగ్గా చేయలేడు, అలాగే బ్యాటింగ్‌లోనూ ఆ స్థాయి ఫామ్‌ను ప్రదర్శించ లేదన్నాడు. షెడ్జ్ కూడా బౌలింగ్ లేదా బ్యాటింగ్ పరంగా ఆకట్టుకోలే కపోయాడు. వాషింగ్టన్ సుందర్ ఇంకా జట్టులో ఎందుకు కొనసాగుతున్నాడో బోధ పడడం లేదన్నాడు. గత కొన్నేళ్లుగా అతని ప్రదర్శనను చూస్తే, అది అంత గొప్పగా ఏమీ లేదన్నాడు. అసలు సంజు శాంసన్ ను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత గంభీర్ పై ఉందన్నాడు హనుమ విహారి.
