ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి స‌ర్కార్ ల‌క్ష్యం

ప్ర‌క‌టించిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత

అన‌కాప‌ల్లి జిల్లా : ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించేందుకు కూట‌మి స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. సోమ‌వారం అన‌కాప‌ల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొన్నారు. బాధితుల సమస్యలను నేరుగా విని, అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి స‌మీక్ష చేప‌ట్టారు. లా అండ్ ఆర్డ‌ర్ అదుపులో ఉంద‌ని, ఈ సంద‌ర్బంగా ఎస్పీని అభినందించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితుల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఎంతో ఓపికగా, స్వయంగా అడిగి తెలుసుకున్నారు మంత్రి.

ప్రజల చెంతకే పాలనను అందించడం, శాంతి భద్రతలను కాపాడటమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంద‌న్నారు. గతంలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఉండేదన్నారు. కానీ నేడు సామాన్య పౌరుడికి, ముఖ్యంగా మహిళలకు పూర్తి భరోసా కల్పించేలా పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని కితాబు ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో ఎస్పీ తుహిన్ సిన్హా నేతృత్వంలో పోలీసులు ప్రజలకు ఎంతో జవాబుదారీగా ఉంటూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను నిజం చేస్తున్నారని కొనియాడారు. ఈ రోజు PGRS కి వచ్చిన ప్రతి అర్జీని నేను, ఎస్పీ స్వయంగా పరిశీలించిన‌ట్లు తెలిపారు.. సివిల్ వివాదాలు, కుటుంబ గొడవలు, సైబర్, ఆర్థిక మోసాల బారిన పడిన బాధితులకు తక్షణ న్యాయం చేయాలని ఆదేశించారు.

Leave A Reply

Your Email Id will not be published!