న్యూఢిల్లీ : వివాదాస్పద నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఉన్నట్టుండి ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ ను ఏకి పారేశారు. తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో హృతిక్ స్పందనకు సంబంధించిన కథనాన్ని షేర్ చేస్తూ, తన పేరును వాడుకుని తనను వేధిస్తున్న, బెదిరిస్తున్న వారిని హృతిక్ ఖండించాలని కంగనా రనౌత్ కోరారు. అహేతుకమైన వ్యాఖ్యలు చేసినందుకు, ఆన్లైన్ ట్రోలింగ్‌ను ప్రోత్సహించినందుకు నటి కంగనా రనౌత్ హృతిక్ రోషన్‌ను తీవ్రంగా విమర్శించారు. మనం హృతిక్ రోషన్‌కు క్షమాపణ చెప్పాలి అని ఉన్న ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌పై రోషన్ ఇటీవల స్పందించారు. విద్యార్థుల నిరసనలపై రనౌత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పోస్ట్ షేర్ చేయబడింది.
ఆన్లైన్ కథనాల ప్రభావానికి ప్రజలు లోను కాకూడదని, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సరైన సందర్భం , వాస్తవాల కోసం వేచి చూస్తానని ఆయన బదులిచ్చారు.నా మిత్రమా, ‘బి’ ఇకపై నచ్చలేదన్న కారణంతో ‘ఎ’ పక్షం వహించడం అనేది మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న పెద్ద వ్యవస్థాగత సమస్యలో ఒక చిన్న భాగం మాత్రమేనని పేర్కొన్నారు. . సందర్భం సరైనదిగా ఉండి, వాస్తవాలపై ఆధారప డినప్పుడు నేను స్పందిస్తాను. అదే న్యాయం. కానీ, ఇప్పుడు దాని గురించి ఎవరికి పట్టిందిలే అని ఆయన ఆ కామెంట్లో రాశారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో హృతిక్ రోశన్ స్పందనకు సంబంధించిన కథనాన్ని షేర్ చేస్తూ, తన పేరును వాడుకుని తనను వేధిస్తున్న , బెదిరిస్తున్న వారిని హృతిక్ ఖండించాలని రనౌత్ అన్నారు.
ప్రియమైన హృతిక్ నీకు సరిగ్గా సరిపోయే భాగస్వామి సబా ఆజాద్ దొరికినందుకు సంతోషం, మీరిద్దరూ కలిసి చాలా బాగుంటారు. మీరు ఒక నిబద్ధతతో కూడిన బంధంలో ఉన్నారు, కాబట్టి ఒక మహిళను ఇలా ఎగతాళి చేయడం మీకు తగదు అంటూ మండిపడ్డారు కంగనా రనౌథ్.
