తెలంగాణ‌లో ల‌క్ష‌ల్లో ఓట‌ర్లు త‌గ్గే అవ‌కాశం

3.38 ఓట‌ర్ల‌కు గాను 2.64 కోట్ల ఓట‌ర్లు న‌మోదు

హైద‌రాబాద్ : అంద‌రూ అనుకున్న‌దంతా అవుతోంది. తెలంగాణ‌లో భారీ ఎత్తున ఓట‌ర్లు కోల్పోయే ప్ర‌మాదం నెల‌కొంది. ఆగ‌స్టు 10 డెడ్ లైన్ విధించింది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం . ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు పూర్తి వివ‌రాలు స‌మ‌ర్పించేందుకు గ‌డువు ఉండ‌గా దానిని ఈనెల 10వ తేదీ వ‌ర‌కు పొడిగించింది. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స‌ర్) ప్రక్రియ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య 73 లక్షలకు పైగా తగ్గే అవకాశం ఉందని అంచ‌నా. రాష్ట్రంలోని మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో, 2.64 కోట్ల (78.30 శాతం) మందికి సంబంధించిన ఓటర్ల వివరాల సేకరణ పత్రాలు డిజిటలైజ్ చేయబడ్డాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సమయంలో భారీ సంఖ్యలో ఓటర్ల వివరాల సేకరణ పత్రాలు సేకరించలేనివిగా తేలడంతో, తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 73 లక్షలకు పైగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలోని మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో 2.64 కోట్ల (78.30 శాతం) మందికి సంబంధించిన వివరాల సేకరణ పత్రాలు డిజిటలైజ్ చేయబడ్డాయని ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 73.39 లక్షల (21.70 శాతం) వివరాల సేకరణ పత్రాలు సేకరించలేనివిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిలో మరణించిన 9,22,230 మంది ఓటర్లు ఉన్నార‌ని తెలిపారు. అందుబాటులో లేని లేదా ఆచూకీ దొరకని ఓట‌ర్ల లో 11,25,546 మంది, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిన వారిలో 45,18,961 మంది, ఇప్పటికే నమోదైన 6,70,203 మంది, ఇతర వర్గాలకు చెందిన 1,02,294 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ లో భాగంగా బిఎల్ఓల ఇంటింటి సందర్శన కార్యక్రమం జూన్ 25న ప్రారంభమైంది. ఆగస్టు 10న ముగిసింది. ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17న విడుదల కానుంది. క్లెయిమ్‌లు , అభ్యంతరాలను దాఖలు చేసే ప్రక్రియ ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16 వరకు జరుగుతుందని తెలిపారు సీఈవో. నోటీసు దశ , క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఆగస్టు 17 నుండి అక్టోబర్ 15 వరకు చేపడతారు. తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 19న విడుదల చేస్తారు.

Leave A Reply

Your Email Id will not be published!