హెచ్-1బి గ్రేస్ పీరియడ్‌ను ముగించాలని యుఎస్ నిర్ణయం
భారతీయ టెక్కీలకు కోలుకోలేని షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఉద్యోగం కోల్పోయిన తర్వాత, హెచ్-1బి వీసాలపై ఉన్న నైపుణ్యం గల కార్మికులతో సహా కొంతమంది వలసదారులు యునైటెడ్ స్టేట్స్లో ఉండి, కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవడానికి అనుమతించే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు యుఎస్ ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన ప్రణాళికాబద్ధమైన నియమ మార్పు ప్రకారం హెచ్ 1బి , కొన్ని ఇతర తాత్కాలిక పని వీసాలు ఉన్నవారు తమ ఉద్యోగం ముగిసిన వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. విదేశీ కార్మికులపై ఎక్కువగా ఆధారపడే అగ్రశ్రేణి అమెరికన్ టెక్ కంపెనీలకు ఇది ఒక పెద్ద దెబ్బ.
జనవరి 2025లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి చట్టబద్ధమైన వలసలను పరిమితం చేయడానికి యు.ఎస్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా చర్య ఇది. ఆయన ప్రభుత్వం నైపుణ్యం కలిగిన కార్మికులకు అధిక వీసా రుసుములను కూడా ప్రవేశ పెట్టింది. కొత్త శిక్షణా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందున, ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యు.ఎస్. మిషన్లలో వలసదారుల వీసా నియామకాలను నిలిపి వేసింది. ఈ మార్పు వల్ల ప్రభావితమైన కంపెనీలు కొంత అంతరాయాన్ని ఎదుర్కోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ ఉద్యోగాలు బదులుగా అమెరికన్ కార్మికులకు లభించ వచ్చని పేర్కొంది. కొన్ని పరిస్థితులల, వెళ్ళి పోయిన వలస కార్మికులు వారి యజమాని వారి కోసం పిటిషన్ దాఖలు చేస్తే తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని కూడా అది జోడించింది.
దేశం విడిచి వెళ్లే ముందు – ఇల్లు అమ్మడం లేదా పిల్లలను బడి మాన్పించడం వంటి తమ వ్యవహారాలను చక్కబె ట్టుకోవడానికి విదేశీయులకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ విధించింది సర్కార్.