దేశభక్తి, నైతిక విలువలే మన కుటుంబ వ్యవస్థకు పునాది

భారతీయం కార్యక్రమంలో విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్

అమ‌రావ‌తి : దేశభక్తి, నైతిక విలువలే మన కుటుంబ వ్యవస్థకు పునాది అని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ర్యాంక్స్ తెచ్చుకున్న పిల్లల ఫోటోలతో పత్రికలు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామ‌న్నారు. ఈ ఏడాది 1.10 లక్షల మంది స్టూడెంట్స్ ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. ఇంటర్ లో కూడా 10 వేల అడ్మిషన్స్ పెరిగాయని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల సహకారంతోనే ఈ ఫలితాలు సాధించామ‌న్నారు. దీనికి నైతిక విలువలు కూడా తోడైతే మన ఎపి మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేశంలోనే నెం.1గా మారుతుందని ధీమా వ్య‌క్తం చేశారు లోకేష్‌. కాకినాడ రూరల్ తిమ్మాపురం ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో భారతీయం పేరుతో పాఠశాల విద్యాశాఖ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో భారతీయం పేరుతో నిర్వహించిన దేశభక్తి కార్యక్రమానికి లోకేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ చాగంటి ప్రవచనం వినపడని ఇల్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండదన్నారు.

చాగంటిని ఎప్పుడు కలిసినా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పారు నారా లోకేష్‌. ‘భారతీయం’ అనే గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గురువుకి ధన్యవాదాలు తెలిపారు. నాది భారతదేశం…నేను భారతీయుడిని. మన భారతదేశం. మన గౌరవం, మన సనాతన ధర్మం మన బలం. నైతిక విలువలకు పుట్టినిల్లు మన దేశం. మానవత్వం మన వారసత్వం. నైతిక విలువలే కుటుంబ వ్యవస్థ మన పునాది అన్నారు. వైద్యంలో చరకుడు, రాజనీతిలో చాణుక్యుడు, గణితంలో ఆర్యభట్ట, యోగాలో పతంజలి, ఆయుర్వేదంలో ధన్వంతరి పురాతన కాలంలోనే భారతీయుల సత్తా ప్రపంచానికి చూపించారని అన్నారు.

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు అంటే గౌరవంగా చూస్తారు. అదే పెద్దవాళ్లు మనకు ఇచ్చిన ఆస్తి. విలువలతో కూడిన సమాజం, కుటుంబ వ్యవస్థ. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ద స్ట్రెంత్ ఆఫ్ అవర్ నేషన్. ఇంత గొప్ప ఆస్తిని కాపాడు కోవడమే కాదు భావి తరాలకు అందించాల‌ని పిలుపునిచ్చారు లోక‌ష్‌.
అందుకే నైతిక విలువలతో కూడిన విద్య అందిస్తున్నాం అన్నారు. నైతిక విలువలు అనగానే గుర్తొచ్చే మొదటి పేరు చాగంటి కోటేశ్వరరావు. అందుకే మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను నైతిక విలువల సలహాదారుగా నియమించారు. ఆయన రూపొందించిన పుస్తకాలు విద్యార్థులకు అందిస్తున్నాం. చిన్నతనం నుండే పెద్దలను, మహిళలను గౌరవించడం నేర్పిస్తున్నాం. గెలుపు – ఓటమి రెండింటినీ సమానంగా తీసుకునేలా తయారు చేయడమే లక్ష్యం. అని స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!