త్వ‌ర‌లోనే కుప్పంలో విమానాశ్ర‌యం ఏర్పాటు చేస్తాం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసే ప‌నిలో ప‌డింది. ఈ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు సోమ‌వారం చిత్తూరు జిల్లా కుప్పంలో జ‌రిగిన ప‌ర్య‌ట‌న‌లో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌త్యేకించి రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు డిజిటల్ లిటరసీతో పాటు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా శిక్షణ అందిస్తున్నాం అని చెప్పారు. కుప్పంలోనూ 8500 మంది మహిళలకు శిక్షణ అందుతోందని తెలిపారు. కుప్పంలో 32 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని వెల్ల‌డించారు. రెండేళ్లలో పరిశ్రమలు, అనుబంధ కార్యక్రమాలతో యువతకు ఉద్యోగాలు ఇవ్వ‌డం జరిగింద‌న్నారు సీఎం. స్థానికంగా వచ్చిన పరిశ్రమల్లో స్థానిక యువతకే ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం అని తెలిపారు.

బిర్లా ఇనిస్టిట్యూట్ ఇప్పటికే నైపుణ్య శిక్షణ ఇస్తోందని వెల్ల‌డించారు నారా చంద్ర‌బాబు నాయుడు. మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తాం అని తెలిపారు. దాదర్- పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలు ఇవాళ్టి నుంచి కుప్పం రైల్వే స్టేషనులో ఆగుతుందని ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. కుప్పాన్ని అనుసంధానిస్తూ బెంగుళూరు, చైన్నై, కేజీఎఫ్, కృష్ణగిరి లాంటి ప్రాంతాలను అనుసంధానించేలా జాతీయ రహదారులు వస్తున్నాయని ప్ర‌క‌టించారు . కుప్పం- పొగురుపల్లి నుంచి బెంగుళూరుకు ఓ ప్రత్యామ్నాయ రహదారిని కూడా నిర్మిస్తున్నాం అని వెల్ల‌డించారు. చిత్తూరు నుంచి కుప్పానికి బ్రాడ్ గేజ్ లైన్ కనెక్ట్ చేయాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ను కోరాన‌ని చెప్పారు. కుప్పంలో ఉత్పత్తి చేసిన వస్తువులు కృష్ణపట్నం పోర్టుకు చేరేలా ఈ కనెక్టివిటీని పెంచుతున్నామని పేర్కొన్నారు. త్వరలోనే కుప్పంలో ఎయిర్ పోర్టును కూడా ఏర్పాటు చేస్తాం అని ప్ర‌క‌టించారు. మొత్తంగా స్వర్ణ కుప్పంగా ఈ నియోజకవర్గాన్ని మారుస్తాం అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

Leave A Reply

Your Email Id will not be published!