దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు ఇక లేరు

చెన్నైలోని కావేరి ఆస్ప‌త్రిలో క‌న్నుమూత

చెన్నై : ప్ర‌ముఖ చ‌ల‌న చిత్ర ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాసరావు చెన్నైలోని కావేరి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయ‌న మృతితో తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం అలుముకుంది. ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాలు రూపొందించారు. చివరిగా ఆయన నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగ్ గీతం అనే సినిమాకి దర్శకత్వం వహించారు. 95 ఏళ్ళ వయసులో కూడా దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. సింగీతం శ్రీనివాసరావు తనదైన ప్రయోగాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ దర్శకుడు. పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం, మయూరి వంటి సినిమాలు ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి.

ఆయ‌న 21 సెప్టెంబ‌ర్ 1931లో అప్ప‌టి మద్రా్ ప్రెసిడెన్సీ లోని నెల్లూరు జిల్లా లోని ఉద‌య‌గిరిలో పుట్టారు. మ‌ద్రాస్ యూనివ‌ర్శిటీలో చ‌దువుకున్నారు. ఆ త‌ర్వాత సినీ రంగంపై మ‌క్కువ‌తో ఎంట్రీ ఇచ్చారు. సింగీతం మొదట ప్రముఖ దర్శకుడు కె.వి. రెడ్డి వద్ద అసోసియేట్‌గా పనిచేశారు. మాయాబజార్, జగదేక వీరుని కథ వంటి క్లాసిక్ చిత్రాల నిర్మాణ ప్రక్రియను దగ్గరగా పరిశీలించారు. 1972లో నీతి నిజాయితీ అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. 1977 లో త‌రం మారింది తీశాడు. ఇది నంది అవార్డు పొందింది. 1978లో పంతుల‌మ్మ తీశాడు. ఇది విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. 1979లో క‌మ‌ల్ హాస‌న్ తో ప్ర‌యోగాత్మ‌కంగా సొమ్మొక‌డిది సోకొక‌డిది అనే సినిమా తీశాడు.

1984లో సుధా చంద్ర‌న్ జీవిత క‌థ ఆధారంగా మ‌యూరి తీశాడు సింగీతం శ్రీ‌నివాస రావు. మాట‌లు లేకుండానే మూకీ మూవీ తీశాడు క‌మ‌ల్ హాస‌న్ తో 1987లో పుష్పక విమానం. 1991లో బాల‌కృష్ణ‌తో ఆదిత్య 369 , 1992లో కుటుంబ‌, హాస్య చిత్రం బృందావ‌నం తీశాడు. 1994లో జాన‌ప‌ద ఫాంట‌సీ నేప‌థ్యంతో భైర‌వ‌ద్వీపం , 1994లోనే మేడ‌మ్ , 2001లో ఆకాశ వీధిలో , 2005లో ముంబై ఎక్స్ ప్రెస్ , 2013లో వెల్‌కమ్ ఒబామాకు ద‌ర్శ‌క‌త్వం వహించాడు. త‌న సినీ కెరీర్ లో సింగీతం శ్రీ‌నివాస రావు 60 చిత్రాలు తీశాడు

Leave A Reply

Your Email Id will not be published!