ధ‌రాపురం ప్ర‌చారంలో ఉద‌య‌నిధి స్టాలిన్ పై కేసు

ఎన్నిక‌ల క్యాంపెయిన్ లో చిన్నారి పాల్గొన్నందుకు

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఉప ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆదివారం డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ఉద‌య‌నిధి స్టాలిన్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ధ‌రాపురం ఎన్నిక‌ల ప్ర‌చారంలో చిన్నారిని పాల్గొనేలా చేసినందుకు గాను ఉద‌య‌నిధిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇదిలా ఉండ‌గా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా చిన్నారిని ఎలా ప్ర‌చారంలో ఉప‌యోగిస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇది ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళికి పూర్తిగా విరుద్ద‌మ‌ని పేర్కొన్నారు పోలీసులు. ధరాపురం పట్టణంలోని పెరియార్ విగ్రహం వద్ద జరిగిన ప్రచార సభలో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ధరాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఉదయనిధిపై ఏ చట్టపరమైన నిబంధనల కింద కేసు నమోదు చేశారే విష‌యాన్ని వెల్ల‌డించ‌లేదు.

అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలోనే పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో పిల్లలను పాల్గొననీయ కూడదన్న ఎన్నికల సంఘం ఆదేశాలను జిల్లా పోలీసులు ప్రస్తావించారు. ఎన్నికలకు సంబంధించిన ఏ కార్యకలాపానికైనా పిల్లలను ఉపయోగించ కూడదని కమిషన్ ఆదేశించిందని స్పష్టం చేశారు. డీఎంకే ప్రచార సభకు సంబంధించిన ఆరోపణలను వివరిస్తూ పోలీసులు ఈ ఆదేశాలను ఉదహరించారు. తమిళనాడు ముఖ్యమంత్రిని అవమానించేలా ఒక చిన్నారి చేత ఉదయనిధి మాట్లాడించారని వెల్ల‌డించారు. ఎన్నికల ప్రచారం కోసం పిల్లలను ఉపయోగించు కున్నారని కూడా ఆయనపై ఆరోపణలు వచ్చాయి, అయితే ఆ చిన్నారి చేసిన వ్యాఖ్యలను మాత్రం అందులో పొందుపరచలేదు.

Leave A Reply

Your Email Id will not be published!