శివ కార్తికేయ‌న్ ‘పాలిటిక్స్’ పై ఫోక‌స్ పెట్టాడా..?

త‌మిళ‌నాడులో అభిమానుల ప్ర‌త్యేక స‌మావేశం

చెన్నై : త‌మిళ‌నాడులో మ‌రో న‌టుడు చ‌ర్చ‌కు దారితీసేలా చేశాడు. ఇప్ప‌టికే ప‌లువురు న‌టులు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా టాప్ హీరోల‌లో ఒక‌డిగా పేరు పొందిన శివ కార్తికేయ‌న్ పాలిటిక్స్ లోకి వ‌చ్చేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడా. అవున‌నే అనిపిస్తోంది. తాజాగా శివ కార్తికేయన్ ఫ్యాన్స్ మీట్ పెట్ట‌డం క‌ల‌క‌లం రేపింది త‌మిళ‌నాట‌. హీరోల ఫ్యాన్స్ మీట్స్ ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. విజయ్ రాజకీయ అరంగేట్రం తర్వాత అభిమానులతో వరుస సమావేశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా హీరో శివకార్తికేయన్ తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ రాజకీయ సమావేశాన్ని తలపించేలా ఉండటంతో పాటు.. సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్ర‌త్యేకంగా సూచించడం హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే త‌మిళ‌నాడులో విజ‌య్ సీఎం కాగా ఆయ‌న బాట‌లోనే మ‌రికొంద‌రు న‌టులు సూర్య‌, ర‌జ‌నీకాంత్ ఫాలో అవుతున్నారు. దీంతో సినీ హీరోలు భవిష్యత్ రాజకీయాల కోసం ఇప్పటి నుంచే తమ అభిమాన బలాన్ని ఒక వ్యవస్థగా మలుచుకుంటున్నారా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే ఈ ఫ్యాన్స్ మీట్స్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి అన్నది ఆయా హీరోలే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉండ‌గా శివ కార్తికేయ‌న్ అస‌లు పేరు శివ కార్తికేయన్ దాస్. త‌ను త‌మిళ‌నాడులోని శివ‌గంగై జిల్లాలోని సింగంపున‌రిలో 17 ఫిబ్ర‌వ‌రి 1985లో పుట్టాడు. వృత్తి ప‌రంగా న‌టుడు, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత, గాయకుడు, గేయ రచయితగా గుర్తింపు పొందాడు.

శివకార్తికేయన్ మొదట టీవీ యాంకర్, మిమిక్రీ ఆర్టిస్ట్, స్టాండ్-అప్ కమెడియన్గా గుర్తింపు పొందారు. క‌ల‌క్క పొవ‌త్తు యారు కార్యక్రమం ద్వారా పాపులర్ అయ్యారు. అనంతరం ధనుష్ నటించిన 3 సినిమాలో చిన్న పాత్రలో కనిపించి, మ‌రీనా (2012) ద్వారా హీరోగా పరిచయమయ్యారు.

Leave A Reply

Your Email Id will not be published!