కేంద్రం, ఎన్నిక‌ల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

స్వాగ‌తించిన ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తో పాటు కేంద్ర స‌ర్కార్ కు బిగ్ షాక్ త‌గిలింది. తాజాగా సీఈసీ నిర్ణయాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు కొత్త ఆయుధాన్ని అందించాయి. క్లుప్తంగా చెప్పాలంటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ప్రధాన ఎన్నికల కమిష‌న‌ర్ జ్ఞనేష్ కుమార్ రాజ్యాంగాన్ని అక్షరాలా స్ఫూర్తిపరంగా ద్రోహం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. భారత ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలలో జరిగినట్లుగా ఆరోపించ బడుతున్న అక్రమాలపై సీఈసీపై తగినంత ఒత్తిడి తీసుకు రావడంలో లేదా ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో ప్రతిపక్ష పార్టీలు విఫలమైనప్పటికీ, ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ఎన్నికల సంఘం అనేక నిర్ణయాలు తీసుకుందని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కేంద్రానికి , ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేయడం ప్రతిపక్షాలకు కొత్త బలాన్ని చేకూర్చింది.

పదవీ విరమణ తర్వాత కూడా రక్షణ కల్పించే ‘ఇమ్యూనిటీ క్లాజ్’ తో సహా జ్ఞనేష్ కుమార్ తీసుకున్న అన్ని నిర్ణయాలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందించారు. ఎన్నికల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన మొదటి సీఈసీ దివంగత సుకుమార్ సేన్ కాలం నుండి దశాబ్దాలుగా కొనసాగిన సముచితమైన , సమర్థ వంతమైన పనితీరుపైనే ఈ విశ్వాసం ఆధారపడి ఉందన్న విషయాన్ని సుప్రీంకోర్టు గమనించాలి. ఆ సద్భావనలో ఏదీ జ్ఞనేష్ కుమార్‌కు దక్కదని అన్నారు. మొదట్లో సూచించబడిన ‘ఫారం 6’ సవరణ, ఆయన అనుసరించిన కుటిలమైన , ఏమాత్రం సమర్థించుకోలేని ప్రవర్తనకు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!