ఏబీఎన్ రాధాకృష్ణా ప‌క్కింట్లోకి తొంగి చూస్తే ఎలా..?

అల్లుడు కోగంటి భాను ప్ర‌కాష్ షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ : పొద్ద‌స్త‌మానం తెలంగాణ రాష్ట్రంపై విషం క‌క్కే ఏబీఎన్ రాధాకృష్ణ‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది త‌న అల్లుడు కోగంటి భాను ప్ర‌కాష్ రూపంలో. ఆయ‌న నిత్యం ఆంధ్రాకు వంత పాడుతూ, టీడీపీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును నిత్యం పొగుడుతూ ఇక్క‌డ కేసీఆర్ ను, ఆయ‌న ఫ్యామిలీని, తెలంగాణ సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను విమ‌ర్శిస్తూ వ‌స్తున్నాడు. ఈ నేప‌థ్యంలో త‌న అల్లుడు తాజాగా ఏబీఎన్ ను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. సోష‌ల్ మీడియాలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆయ‌న ఏకంగా ఏబీఎన్ ను ఉద్దేశించి పక్కింట్లోకి తొంగి చూడడం కాదు, సొంతింట్లో ఏం జరుగుతుందో చూడాలంటూ చుర‌క‌లు అంటించాడు. ఏబీఎన్ సంస్థ నుంచి స్వంత అల్లుడైన కోగంటి భాను ప్ర‌కాష్ ను డైరెక్ట‌ర్ ప‌ద‌వి నుంచి తొల‌గించాడు రాధాకృష్ణ‌. ఇదిలా ఉండ‌గా తనను డైరెక్టర్ పదవి నుంచి తప్పించి మరో మహిళకు డైరెక్టర్ పదవి కల్పించడంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

రాధాకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి చైర్మన్ హోదాకు మారగా కొడుకు ఆదిత్య వేమూరికి మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు, కుమార్తె అనూష వేమూరికి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది .అయితే అక్టోబర్ 9న విడుదల చేసిన కొత్త పదవుల జాబితాలో ఇన్నాళ్లూ డైరెక్టర్‌గా కొనసాగుతున్న సొంత అల్లుడు కోగంటి భాను ప్రకాశ్‌ను ఆ హోదా నుంచి తప్పించి, శ్రుతి కీర్తి అనే మరో మహిళకు అవకాశం కల్పించడం రాద్దాంతానికి దారితీసింది. దీంతో పక్కింట్లోకి తొంగి చూడడంలో బిజీగా ఉంటూ, సొంతింట్లో ఏం జరుగుతుందో చూసుకోవడం మానేశారంటూ రాధాకృష్ణపై పరోక్ష విమర్శలు చేశాడు కోగంటి భాను ప్ర‌కాష్. ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుటుంబంలో క‌ల‌హాలు మొద‌లు కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

Leave A Reply

Your Email Id will not be published!