హైదరాబాద్ : తమిళన చలన చిత్ర పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా సీక్వెల్ చిత్రం జైలర్ -2 . దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పాజిటివ్ టాక్ తో భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం రూ. 1,000 కోట్ల క్లబ్ లోకి చేరుకునే దిశగా నడుస్తోంది. సూపర్ స్టార్ సినీ కెరీర్ లో భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. రజనీకాంత్ ‘జైలర్ 2’ చిత్రం 12వ రోజు నాటికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 733 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, శంకర్ దర్శకత్వంలోని ‘2.0’ సినిమా రికార్డును అధిగమించింది. ఇప్పుడు ఈ చిత్రం రూ. 1,000 కోట్ల మైలురాయిని చేరుకునే దిశగా పయనిస్తోంది. ‘తలైవా’ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగ రాస్తోంది. విడుదలైన ఎనిమిది రోజుల్లోనే ఈ చిత్రం ₹600 కోట్లకు పైగా వసూలు చేయగా, తాజాగా శంకర్ దర్శకత్వంలోని ‘2.0’ (సుమారు ₹691 కోట్ల వసూళ్లు) రికార్డును దాటేసింది.
బాక్సాఫీస్ వద్ద ఇదే జోరు కొనసాగితే మరో వారంలోనే ఈ సినిమా వేయి కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని చిత్ర బృందం భావిస్తోంది. తాజా నివేదికల ప్రకారం 12వ రోజున ఈ చిత్రం భారతదేశవ్యాప్తంగా 10,450 షోల ద్వారా ₹9.45 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో భారతదేశంలో మొత్తం గ్రాస్ వసూళ్లు ₹479.37 కోట్లకు, నెట్ వసూళ్లు ₹409.44 కోట్లకు చేరుకున్నాయి. ఇక విదేశీ వసూళ్లతో కలిపి, ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సాధించిన మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 733.35 కోట్లుగా ఉన్నాయి. ఈ వారాంతానికి సినిమా రూ. 800 కోట్ల మార్కును దాటుతుందని చిత్ర నిర్మాతలు ఆశిస్తున్నారు. మొదటి రోజు భారతదేశ గ్రాస్ వసూళ్లు: ₹70.25 కోట్లు కాగా ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్ల: ₹127.25 కోట్లు. 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్త గ్రాస్ వసూళ్లు ₹418.25 కోట్లు. 11వ రోజు నాటికి భారతదేశ గ్రాస్ వసూళ్లు (మొత్తం) రూ. 466.85 కోట్లు. ప్రపంచ వ్యాప్త గ్రాస్ వసూళ్లు ₹719.85 కోట్లు కావడం విశేషం.
