చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన అత్యంత సాధారణమైన వ్యక్తినని చేతల్లో నిరూపించుకుంటున్నారు. ఈరోడ్ జిల్లా పెరుందురైలో ప్రభుత్వ కార్యక్రమం అనంతరం కోయంబత్తూరు విమానాశ్రయానికి వెళ్తుండగా తిరు.సి.జోసెఫ్ విజయ్ కోయంబత్తూరు జిల్లాలోని కారుమత్తంపట్టి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీసులకు కీలక సూచనలు చేశారు. మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల ముప్పును అరికట్టడంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. సాయం కోసం వచ్చే బాధితులకు భరోసా ఇవ్వాలని సూచించారు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఈ ఆకస్మిక తనిఖీలో సీఎంతో పాటు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శాంతిభద్రతలు) టి.ఎస్. అన్బు , వెస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్.వి. రమ్య భారతి ఉన్నారు.
మహిళలు , పిల్లలపై జరుగుతున్న నేరాలను, అలాగే మాదకద్రవ్యాల చలామణిని అరికట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించారు సీఎం. హోం , పోలీస్ శాఖలను కూడా తన ఆధీనంలో ఉంచుకున్న ముఖ్యమంత్రి పోలీసు సిబ్బందికి ఏవైనా అవసరాలు ఉన్నాయా అని కూడా అడిగి తెలుసుకున్నారు. ఈరోడ్ జిల్లాలోని పెరుందురైలో 13 జిల్లాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలకు సంక్షేమ సహాయాన్ని అందజేసి కోయంబత్తూరు విమానాశ్రయానికి తిరిగి వస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ ఈ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఆగింది.
ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. ఇన్స్పెక్టర్ కమ్ ఎస్హెచ్ఓ నవనీతకృష్ణన్ జి.తో మాట్లాడారు. స్టేషన్ పనితీరు, శాంతిభద్రతల పరిస్థితి, తమ పరిధిలో జరుగుతున్న నేరాలకు సంబంధించి ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు మిస్టర్ రెడ్డి , మిస్టర్ నవనీతకృష్ణన్ సమాధానం ఇచ్చారు.
