ర్యామ్ వినియోగంపై సామ్ ఆల్ట్ మాన్ కామెంట్స్

స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన సీఈఓ ఎలాన్ మ‌స్క్

వాషింగ్ట‌న్ : ఇద్ద‌రు టెక్ దిగ్గ‌జ సంస్థ‌ల అధినేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. వ్యక్తిగత కంప్యూటర్లలో ర్యామ్ వినియోగంపై సామ్ ఆల్ట్‌మాన్ విమర్శలు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించాడు స్టార్ లింక్ చైర్మ‌న్ , ఎక్స్ సీఈఓ ఎలాన్ మ‌స్క్ స్పందించాడు. ప్రజలకు అది దక్కాల్సిందేనని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ర్యామ్ ధరలు పెరుగుతున్న తరుణంలో వ్యక్తిగత కంప్యూటర్లలో ఉండే మెమరీ వినియోగంపై సామ్ ఆల్ట్‌మాన్ చేసిన వ్యాఖ్యలు ఎలాన్ మస్క్‌తో చర్చకు దారితీశాయి. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ వ్యక్తిగత కంప్యూటర్లలో పెద్ద మొత్తంలో ర్యామ్ నిరుపయోగంగా ఉండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పరిమితంగా ఉన్న ఈ వనరు వృథా అవుతోందని పేర్కొన్నారు. దీనిపై టెస్లా , స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందిస్తూ ప్రజలకు తమకు నచ్చినంత మెమరీని కలిగి ఉండే స్వేచ్ఛ ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘చీకీ పింట్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పరిమితంగా ఉన్న డిర్యామ్ లో కొంత భాగాన్ని ప్రతి ఒక్కరూ తమ సొంత కంప్యూటర్లలో ఉంచుకుని, దాన్ని ఉపయోగించకుండా వదిలేయడం చాలా దారుణం అని ఆల్ట్‌మాన్ అన్నారు.

వ్యక్తిగత పరికరాల్లో ఉండే మెమరీలో చాలా భాగం. రోజులో ఎక్కువ సమయం ఖాళీగానే ఉంటుందని, కేవలం 5 శాతం సమయం మాత్రమే వినియోగంలో ఉంటుందని ఆయన వాదించారు. దీనిపై ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రజలకు కూడా తమ ర్యామ‌మ్ దక్కాల్సిందే అని పేర్కొన్నారు . అయితే ఆయన నేరుగా ఆల్ట్‌మాన్ పేరును ప్రస్తావించలేదు. ఈ చర్చ మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఒక వినియోగదారుడు ఆల్ట్‌మాన్‌ను ఉద్దేశించి అభ్యంతరకరమైన పదాన్ని వాడగా, దానికి మస్క్ సీరియస్‌గానా? అని క్లుప్తంగా సమాధానమిచ్చారు. సామ్ ఆల్ట్‌మాన్ ఎందుకు ఈ ప్రశ్న లేవనెత్తారంటే అందుబాటులో ఉన్న మెమరీ వనరులను ఎంత సమర్థవంతంగా ఉపయోగిస్తున్నా మనేదే ఆల్ట్‌మాన్ వాదనకు మూలం. ఆయన అభిప్రాయం ప్రకారం వ్యక్తిగత కంప్యూటర్లలోని ర్యామ్ చాలా వరకు నిష్క్రియంగా ఉంటుంది. అదే పెద్ద డేటా సెంటర్లలోని మెమరీని అయితే, రోజు మొత్తం అనేకమంది వినియోగదారులు , అప్లికేషన్ల మధ్య పంచుకోవచ్చు. వ్యక్తిగత కంప్యూటర్లలో ఓపెన్-సోర్స్ ఏఐ మోడళ్లను రన్ చేయడం వల్ల డేటా సెంటర్లపై ఒత్తిడి తగ్గుతుందనే వాదనను కూడా ఆయన ప్రశ్నించారు.

Leave A Reply

Your Email Id will not be published!