కీవీస్ తో యుద్దానికి సిద్దంగా ఉన్నాం : శుభ్ మ‌న్ గిల్

మా టాప్ ఫోర్ బ్యాటర్ల‌ను ఇప్ప‌టికే ఖ‌రారు చేశాం

ముంబై : భార‌త వ‌న్డే క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. న్యూజిలాండ్ జ‌ట్టుతో జ‌రిగే వ‌న్డే సీరీస్ కు తాము సిద్ద‌మై ఉన్నామ‌ని తెలిపాడు. ఇందులో తాము ఎలాంటి ప్లాన్ లు అమ‌లు చేస్తున్నామ‌నే దానిపై కూడా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. మా టాప్ ఫోర్ ఖరారైంది, అందరూ కుడిచేతి వాటం బ్యాటర్లేస‌ని తెలిపాడు. భారత బ్యాటింగ్ క్రమాన్ని వెల్లడించాడు గిల్. నవంబర్ 2025లో మెడకు సంబంధించిన సమస్య కారణంగా దాదాపు నెల రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న గిల్, తన మెడ గాయం గురించి వస్తున్న ఆందోళనలను కొట్టి పారేశారు. ఆక్లాండ్‌లో బుధవారం ప్రారంభం కానున్న న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు బ్యాటింగ్ ప్రణాళికలను కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మంగళవారం వెల్లడించారు. జట్టులోని మొదటి నలుగురు బ్యాటర్లు ఖరారయ్యారని, వారంతా కుడిచేతి వాటం బ్యాటర్లేనని (గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్) ఆయన పేర్కొన్నారు.

సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడిన గిల్ 5 , 6వ స్థానాల విషయంలో జట్టు అనువైన విధానాన్ని అనుసరిస్తుందని చెప్పారు. ఈ స్థానాల్లో ఎడమచేతి వాటం బ్యాటర్లు కేఎల్ రాహుల్ , అక్షర్ పటేల్ మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా బాధ్యతలు పంచుకుంటారని తెలిపారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి కేఎల్ రాహుల్ కూడా వెళ్లవచ్చు. ఇలా మేము కొంత సౌలభ్యంతో వ్యవహరిస్తాం అని మొదటి వన్డేకు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ చెప్పారు. మొదటి మూడు వన్డేలకు జట్టుకు నాయకత్వం వహించనున్న గిల్, ఆ తర్వాత ఈ నెల చివరలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం సిద్ధమయ్యేందుకు జట్టు నుంచి తప్పుకోనున్నారు. ఇక హార్దిక్ పాండ్యా పునరాగమనం గురించి స్పందిస్తూ ఈ స్టార్ ఆల్‌రౌండర్ తిరిగి భారత జట్టులోకి రావాలంటే ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని గిల్ పేర్కొన్నారు.

వన్డే ప్రపంచ కప్ కోసం సిద్ధమవుతున్న మా బ్యాటింగ్ విభాగం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. అతను (హార్దిక్) ఒక అద్భుతమైన ఆల్ రౌండర్. ప్రపంచంలో అతని లాంటి నైపుణ్యాలు క లిగిన ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. బౌలర్‌గా, అతన్ని ఆటలోని వివిధ దశల్లో ఉపయోగించుకోవచ్చు. అతను కొత్త బంతితోనూ, పాత బంతితోనూ బౌలింగ్ చేయగలడు. గాయాల వల్ల అతను దురదృష్టవశాత్తూ జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ తర్వాత అతను ఆడలేదు. త్వరలోనే అతను తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను అని పేర్కొన్నాడు శుభ్ మ‌న్ గిల్.

Leave A Reply

Your Email Id will not be published!