విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

కవి సమ్మేళనం, ప్రతినిధుల నమోదుకు 30 డెడ్ లైన్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సహకారంతో మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 12, 13 తేదీల్లో విజయవాడలో రెండు రోజుల పాటు ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు–2026’ నిర్వహించనున్నారు. కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులు, ఫోటోగ్రాఫర్లు ఒకే వేదికపై కలుసుకునేలా ఈ ఉత్సవాలను రూపొందించారు. ఉత్సవాలను సందర్శించాలనే ఆసక్తి ఉన్న సాహిత్య, కళాభిమానులు ప్రతినిధులుగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ప్రతినిధులుగా నమోదైన వారికి ప్రత్యేక గుర్తింపుతో పాటు బ్యాడ్జి, ప్రశంసాపత్రం, నిర్వాహకులు అందించే కిట్ ఇవ్వనున్నారు. తేనీరు, భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తారు. అయితే రవాణా, వసతి సౌకర్యాలను వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతినిధుల నమోదుకు ఎలాంటి రుసుము లేదు.

ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే కవి సమ్మేళనంలో కవితలు చదవాలనుకునే వారు తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. వచన కవిత, పద్యం, నానీలు, రెక్కలు, గజల్స్ తదితర ప్రక్రియల్లో కవులు తమ కవిత్వాన్ని వినిపించవచ్చు. వచన కవితలు మాత్రం 20 పంక్తులకు మించకూడదు. కవి సమ్మేళనంలో పాల్గొని కవిత చదివిన ప్రతి కవికి ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువాతో సత్కారం చేయనున్నారు. నిర్వాహకులు అందించే కిట్‌తో పాటు తేనీరు, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. రవాణా, వసతి ఖర్చులను కవులే భరించాల్సి ఉంటుంది. కవి సమ్మేళనంలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము లేదు. న‌మోదుకు న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంద‌ని తెలిపారు. కవి సమ్మేళనం, ప్రతినిధుల నమోదు వివరాల కోసం చొప్పా రాఘవేంద్రశేఖర్‌ను 83329 03156 నంబరులో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!