తుపాను ప్ర‌భావంతో రూ. 4,600 కోట్ల న‌ష్టం : సీఎం

కేంద్రం ఆదుకోవాల‌ని విన్న‌వించిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : అర్న‌బ్ తుపాను కార‌ణంగా ఏపీలో రూ. 4,600 కోట్ల‌కు పైగా న‌ష్టం వాటిల్లింద‌ని చెప్పారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తాజాగా ముర‌సు ఎఫెక్ట్ వ‌ల్ల ఈ న‌ష్టం భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. పంట‌లను ఆయ‌న ప‌రిశీలించారు. అనంత‌రం రైతుల‌తో మాట్లాడారు. తుఫాన్ సహయక చర్యలను రైతులకు వివరించారు. అర్నబ్, మురసు తుఫాన్ల వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం వచ్చిందన్నారు. తుఫాన్ల వల్ల పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారని చెప్పారు. ఎల్ నినో వల్ల రైతులు గడ్డు పరిస్థితుల్లో ఉంటే పట్టిసీమ ద్వారా నీళ్లందిస్తే రైతులు పంట వేసుకున్నారని తెలిపారు. మంచి దిగుబడితో పంట చేతికందే సమయంలో మురసు తుఫాన్ రైతులను దెబ్బ తీసింద‌న్నారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో చాలా వరకు నష్టాన్ని నివారించగలిగామ‌ని పేర్కొన్నారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలను మురసు తుఫాన్ బాగా ఇబ్బంది పెట్టిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.

ప్రతి రైతు పంటల బీమా చేయించుకోవాలని పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాం అని తెలిపారు సీఎం. పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీతో నష్ట పోయిన పెట్టుబడిని రైతులు దక్కించుకోవచ్చని పేర్కొన్నారు. తుఫాన్లపై ముందస్తు హెచ్చరికలు చేస్తే ఎవ్వరూ తేలిగ్గా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ముందస్తు చర్యలతోనే చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించి.. సహయక చర్యలు వేగంగా చేపట్టగలిగామ‌ని అన్నారు. తుఫాన్ స‌హాయ‌ చర్యల కోసం తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు నుంచి సాయం తీసుకుంటున్నాం అని తెలిపారు. అర్నబ్ తుఫాన్ వల్ల నేల కొరిగిన 30 వేల విద్యుత్ స్థంభాలను పునరుద్దరించగలిగామ‌ని పేర్కొన్నారు. మురసు తుఫాన్ వల్ల కూడా మరో 10 వేల విద్యుత్ స్థంభాలు దెబ్బతిన్న‌ట్లు పేర్కొన్నారు సీఎం. ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్దరిస్తున్నాం అన్నారు.

అర్నబ్, మురసు తుఫాన్ల వల్ల సంభవించిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేస్తున్నామ‌ని తెలిపారు. తుఫాన్ల ప్రభావితంపై కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించామ‌ని పేర్కొన్నారు. తుఫాన్ల ప్రభావంపై ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారని అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చివరి వ్యక్తికి సాయం అందేంత వరకు పని చేస్తామ‌ని చెప్పారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

Leave A Reply

Your Email Id will not be published!