ఆవిష్క‌ర‌ణ‌ల‌కు బెంగ‌ళూరు గ‌మ్య‌స్థానం : సీఎం

ప్ర‌పంచాన్ని స్వాతిస్తున్న క‌ర్ణాట‌క రాష్ట్రం

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కర్ణాటక ఎల్లప్పుడూ ప్రపంచాన్ని రెండు చేతులా స్వాగతిస్తూ వస్తోంద‌ని అన్నారు. మన బెంగళూరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభ, ఆలోచనలు , ఆవిష్కరణలకు ఒక సంగమ స్థానంగా కొనసాగుతోందని చెప్పారు .బెంగళూరు అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రం లో ఏఐ అండ్ బియాండ్ అనే ఇతివృత్తంతో జరుగుతున్న 29వ బెంగళూరు టెక్ సమ్మిట్ 2026ను ప్రారంభించారు. . 65కు పైగా దేశాల నుండి 10,000 మందికి పైగా ప్రతినిధులు, 700 మంది వక్తలు , 1,000 స్టార్టప్‌లను ఒకచోట చేర్చే ఈ మూడు రోజుల సమ్మిట్‌లో 16 నేపథ్య విభాగాలలో 140కి పైగా విజ్ఞాన సదస్సులు జ‌ర‌గ‌డం ఆనందంగా ఉంద‌న్నారు డీకే శివ‌కుమార్. ఇది మన ఉమ్మడి భవిష్యత్తును తీర్చిదిద్దే ఆలోచనలు, ఆవిష్కరణలు, పెట్టుబడులు , సహకారాల కోసం ఒక ప్రపంచ వేదికను సృష్టిస్తుందని అన్నారు సీఎం.

ఇల్-డి-ఫ్రాన్స్ ప్రాంతీయ మండలి అధ్యక్షురాలు వాలెరీ పెక్రెస్, హోం, సమాచార సాంకేతికత బయోటెక్నాలజీ , ఇ-గవర్నెన్స్ శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గే, సైన్స్ టెక్నాలజీ , చిన్న నీటిపారుదల శాఖల మంత్రి డా. అజయ్ ధరం సింగ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా , ఎస్ఎంయులు , స్టార్టప్‌ల మంత్రిత్వ శాఖ, స్టార్టప్‌లు, వెంచర్ , ఇన్నోవేషన్ ఉప మంత్రి సియోంగ్-హ్వాన్ మోక్, విజన్ గ్రూప్ ఛైర్‌పర్సన్ లు, మైక్రోసాఫ్ట్ ఇండియా – సౌత్ ఏషియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్, మైక్రాన్ ఇండియా వ్యవస్థాపక కంట్రీ హెడ్ ఆనంద్ రామమూర్తి, కియోనిక్స్ ఛైర్‌పర్సన్ శరత్ కుమార్ బచే గౌడ, ఎలక్ట్రానిక్స్, ఐటీ, బీటీ, ఎస్&టీ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ ఎన్. మంజుల, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల నాయకులు , ప్రపంచ టెక్నాలజీ కమ్యూనిటీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!