చిరంజీవి ‘మెగావ‌ర్స్’ టాక్ షోపై ఉత్కంఠ

హాజ‌ర‌య్యే ఆ సెల‌బ్రిటీ జంట ఎవ‌రో

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరో గా కొన‌సాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న రాజకీయాల‌కు దూరంగా ఉన్నారు. ప్ర‌స్తుతం సినిమాల‌లో కొన‌సాగుతున్నారు. తాజాగా కాకా చిత్రంలో కీ రోల్ పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలుగా కొన‌సాగుతున్న ఎమ్మెల్యే , న‌టుడు నంద‌మూరి బాల‌య్య‌, అక్కినేని నాగార్జున‌లు సినిమాల‌లో న‌టిస్తూనే ఇంకో వైపు రియాల్టీ షోలు నిర్వ‌హిస్తున్నారు. న‌టులుగా త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న వీరు హోస్ట్ లుగా కూడా స‌క్సెస్ అయ్యారు. బాల‌య్య ఎన్ బీకే పేరుతో షో నిర్వ‌హిస్తుండ‌గా అక్కినేని నాగార్జున పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్నారు. ఇక గ‌తంలో యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా ప్ర‌ముఖ ఓటీటీ సంస్త నెట్ ఫ్లిక్స్ ఆధ్వ‌ర్యంలో టాక్ షోకు ప్లాన్ చేశాడు. దాని పేరు కూడా ప్ర‌క‌టించారు అదే మెగా వ‌ర్స్. ఈ టాక్ షోపై ప్రేక్ష‌కులు, అభిమానులు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా తాజాగా నటుడు సూర్య , నటి జ్యోతిక మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేయనున్న ‘మెగావర్స్’ అనే టాక్ షోలో కలిసి పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ వార్త ఈ స్టార్ కపుల్ అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఈ షో కోసం సూర్య , జ్యోతికలతో ఒక ప్రత్యేక ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌లో వారు తమ సినీ ప్రయాణం, ప్రేమకథ, కుటుంబ జీవితం, చిత్ర పరిశ్రమలో తమ అనుభవాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకునే అవకాశం ఉంది.

చిరంజీవి హోస్ట్ చేయనున్న ఈ షోలో, సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులు , ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ఇప్పటికే నాగార్జున , ఆయన కుటుంబ సభ్యులు ఒక ఎపిసోడ్ షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. ‘మెగావర్స్’ ద్వారా చిరంజీవి ఓటీటీ వేదికపై టాక్ షో హోస్ట్‌గా అడుగు పెడుతున్నారు. ప్రముఖ సినీ ప్రముఖుల జీవితాల్లోని ఆసక్తికరమైన కథలను, వ్యక్తిగత అనుభవాలను ప్రేక్షకులకు పరిచయం చేయడమే ఈ షో ప్రధాన ఉద్దేశ్యం.

Leave A Reply

Your Email Id will not be published!