హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఇంకుడు గుంతల పోటీని ఆలివ్ మిఠాయి నిర్వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది ఆలివ్ మిఠాయి సంస్థ. వర్షపు నీటిని ఆదా చేద్దాం. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలను కాపాడుకుందాం అనే నినాదంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆలివ్ మిఠాయి – ఇంటికో ఇంకుడు గుంత కార్యక్రమం పోస్టర్ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైడ్రా కార్యాలయంలో ఆవిష్కరించారు. వర్షాకాలం వరదలు తగ్గాలన్నా.. వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారించాలన్నా ఇంకుడు గుంతల ఆవశ్యకత ఎంతో ఉందని హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా అన్నారు. వర్షం నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపిస్తే భూగర్భ జలాలను పెంచుకోవచ్చన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకున్నా.. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటే నీటి ఇబ్బందుల నుంచి చాలా వరకు బయట పడే అవకాశం ఉందన్నారు.
ఇంకుడు గుంతను తవ్వి.. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో olive for society పేజీకి COLLAB POST చేసి, ఫాలో చేయాలని ఆలివ్ మిఠాయి సంస్థ యజమాని దొర రాజు సూచించారు. మాకు వచ్చిన వీడియోల్లో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియోలకు రూ. 10 లక్షల బహుమతులు అందజేస్తామన్నారు. Save Water! Save Earth, Tree Guard – working for green world సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్య్యాం అయ్యాయని తెలిపారు కమిషనర్. మొదటి బహుమతికి రూ. 5 లక్షలు, రెండో బహుమతికి రూ. 3 లక్షలు, మూడో బహుమతికి రూ. 2 లక్షలు అందజేస్తున్నామన్నారు. వర్షపు నీటిని ఒడిచి పట్టేలా నగరంలో చెరువులను పునరుద్ధరిస్తున్న హైడ్రాకు దొర రాజు ధన్యవాదాలు తెలిపారు. నగర చెరువుల రూపురేఖలను మారుస్తున్న హైడ్రా కూడా ఈ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు. బహుమతులను కూడా హైడ్రా కమిషనర్ చేతుల మీదుగా అందజేస్తామని ప్రకటించారు.