హైదరాబాద్ : అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఘంటా చక్రపాణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్స్ వేదికగా ఫోటోలు పంచుకున్నారు. కొన్నిసార్లు మనం దైనందిన జీవితంలో చేసే పనులు అసాధారణమైనవిగా మారిచరిత్రలో నిలిచి పోతాయి. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో 32 ఏళ్లపాటు పనిచేశానని తెలిపారు. నిజానికి మా విశ్వవిద్యాలయం (అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో, ఇప్పుడు తెలంగాణలో ఉంది) రాష్ట్రంలోనే అతిపెద్దది అయినప్పటికీ, ఇది హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉన్నప్పటికీ, చాలామంది దీనిని ఒక ప్రధాన విశ్వ విద్యాలయంగా పరిగణించరు.
ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తాము దీనిని ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావాలని, ఒక బహిరంగ వేదికగా మార్చాలని అనుకున్నాము. అక్కడ ఒక ప్రాంగణాన్ని నిర్మించి, దానిని అన్ని వైపుల నుండి ఆలోచనలు వికసించేలా ఒక వేదికగా తీర్చిదిద్దాము. నాటకం, సాహిత్యం, సంగీతం, చర్చలు, సంవాదాలు ఇలా ఎన్నో అంశాలు వెయ్యి పూలలా వికసించే ఒక సార్వత్రిక సామాజిక వేదికను సృష్టించాలని అనుకున్నాం. అలాగే చేశాము కూడా. తాము 2025లో మొదటి ‘ఛాయ’ సాహిత్య ఉత్సవాన్ని నిర్వహించాము, ఇప్పుడు రెండవది జరిగింది. దీనానాథ్ శ్రీనివాస్ నాటకాలు, మైనారిటీ వర్గాలకు చెందిన రచయితలు , ఆలోచనాపరులు, దళిత సంస్కృతి , సాహిత్యం, ఖాదిర్ బాబు ఆధ్వర్యంలోని కథా ఉత్సవాలు, అలాగే ప్రజా కళాకారుడు గొరెటి వెంకన్న ప్రదర్శనలతో దీనిని ఒక శక్తివంతమైన వేదికగా మార్చాము. మా క్యాంపస్‌ను ప్రత్యామ్నాయ పరిశోధకుల కోసం ఒక ప్రయోగశాలగా తీర్చిదిద్దాము.
నవంబర్ 14–15 తేదీలలో మా ప్రాంగణంలో జరిగిన రెండవ ‘ఛాయ’ సాహిత్య ఉత్సవం అద్భుతంగా సాగింది. ఇతర పనుల వల్ల ఆదివారం నేను క్యాంపస్‌లో అందుబాటులో లేకపోయాను, అందుకే చాలామంది మిత్రులను కలవలేక పోయాను. కానీ మొదటి రోజు అద్భుతమైన రచయిత జయమోహన్ నుండి నాకు ఇష్టమైన రచయిత, నటుడు, నిర్మాత, సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషకుడైన అనురాగ్ కశ్యప్ వరకు వందలాది మందిని కలిశాను. అయితే వేలాది మందిని కలవలేకపోయాను. మా క్యాంపస్‌కు ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు.
‘ఛాయ’ ద్వారా తెలుగు సాహిత్యానికి మేము ఒక శాశ్వత నిలయంగా మారగలిగితే, అదే నాకు చాలు. ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా మా కె. శ్రీనివాస్, అరుణాంక్, మోహన్, కుప్పిలి పద్మలకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు ఘంటా చక్రపాణి.
