600 మండల ప్రజా పరిషత్‌లకు ఎన్నికలు పూర్తి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నిర్వహించిన పరోక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 659 మండల ప్రజా పరిషత్‌లకు గాను 600 మండల ప్రజా పరిషత్‌లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. మిగిలిన 59 మండల ప్రజా పరిషత్‌లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తికావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. వీటిలో 34 మండల ప్రజా పరిషత్‌లలో అధ్యక్ష ఎన్నికలు, 59 మండల ప్రజా పరిషత్‌లలో ఉపాధ్యక్ష ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

పెండింగ్‌లో ఉన్న మండల ప్రజా పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను ఇవాళ‌ 11.00 గంటలకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఇదిలా ఉండ‌గా జిల్లాల వారీగా ఎన్నికల జరగని మండల ప్రజా పరిషత్ ల వివరాలు వెల్ల‌డించారు. శ్రీకాకుళం జిల్లా లోని గార, శ్రీకాకుళం ల‌లో ,
విజయనగరం జిల్లా భోగాపురం, పూసపాటిరేగ, మెంటాడ, చీపురుపల్లిల‌లో , అనకాపల్లి జిల్లా బుచ్చయ్య పేట, చోడవరం, రావికమతం, రోలుగుంటల‌లో, అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ, అరకుల‌లో, పోలవరం జిల్లా అడ్డతీగల, గంగవరం ఏజెన్సీ , కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి , ఏలూరు జిల్లా పెదపాడు, లింగపాలెం , కృష్ణా జిల్లా మచిలీపట్నం సౌత్, మచిలీపట్నం నార్త్,గూడూరు, నాగాయలంక , పల్నాడు జిల్లా అచ్చంపేట, రొంపిచర్ల, వినుకొండ , బాపట్ల జిల్లా బాపట్ల , ప్రకాశం జిల్లా కొత్తపట్నం , మార్కాపురం జిల్లా వెలిగండ్ల, హెచ్.ఎం.పాడు, కనిగిరి, పిసి పల్లె ల‌లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు.

వీటితో పాటు తిరుపతి జిల్లా లోని వాకాడు ,ఒజిలి, వెంకటగిరి, నాగులాపురం, తొట్టంబేడు, పిచ్చాటూరు ,
అన్నమయ్య జిల్లా ములకల చెరువు , వైఎస్ఆర్ కడప జిల్లా అట్లూరు, బద్వేల్, చాపాడు, గోపవరం, పోరుమామిళ్ల, బి.కోడూరు, పులివెందుల, సింహాద్రిపురం, వీరబల్లి , అనంతపురం జిల్లా కుడేరు, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, బెలుగుప్ప, పామిడి, కళ్యాణదుర్గం, శ్రీ సత్యసాయి జిల్లా: ముదిగుబ్బ , కర్నూలు జిల్లా సి.బెళగల్, గూడూరు, మంత్రాలయం , నంద్యాల జిల్లా పాగిడ్యాల, ఉయ్యాలవాడ ల‌లో మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!