RRR Movie : 50 రోజుల్లో రానున్న జ‌క్క‌న్న మూవీ

కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసిన మేక‌ర్స్

RRR Movie  : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఆర్ఆర్ఆర్ (రుధిరం – ర‌ణం – రౌద్రం ) సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను అత్యంత అద్భుతంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు. క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్ వాయిదా ప‌డుతూ వ‌చ్చిన‌ప్ప‌టికీ అష్ట‌క‌ష్టాలు ప‌డి ఎలాగోలా పూర్తి చేశారు.

అయితే జ‌క్క‌న్న మూవీ ఆర్ఆర్ఆర్(RRR Movie )నాలుగు సార్లు వాయిదా ప‌డింది. క‌రోనా బూచితో తాము విడుద‌ల చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా సామాజిక మాధ్య‌మాలలో భారీ ఎత్తున ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న ట్రోలింగ్ కు గుర‌య్యాడు.

దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో మూవీ మేక‌ర్స్ ఆర్ఆర్ఆర్ మూవీ డేట్ క‌న్ ఫ‌ర్మ్ చేశారు. ఇప్ప‌టికే పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కించాడు రాజ‌మౌళి. ఇందులో టాలీవుడ్ స్టార్స్ జూన‌యిర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ , ఆలియా భ‌ట్ న‌టించారు.

మ్యూజిక్ ఎప్ప‌టి లాగే ఎం.ఎం. కీర‌వాణి అందించారు. ఇప్ప‌టికే పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే మూవీకి సంబంధించిన ట్రైల‌ర్స్ , పోస్ట‌ర్లు కిరాక్ తెప్పించేలా చేశాయి.

పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR Movie )మూవీకి సంబంధించి తాజాగా పోస్ట‌ర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ప్ర‌పంచ వ్యాప్తంగా దీనిని వ‌చ్చే నెల మార్చి 25న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

అంతే కాదు క్యాప్ష‌న్ కూడా డిఫ‌రెంట్ గా పెట్టారు. కాచుకోండి 50 రోజుల్లో ఆర్ఆర్ఆర్ మూవీ రెడీ అని ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా ఈ మూవీని దాన‌య్య నిర్మిస్తున్నారు.

Also Read : పునీత్ ఫ్యామిలీని ప‌రామ‌ర్శించిన బ‌న్నీ

Leave A Reply

Your Email Id will not be published!