Kavya Maran : ఐపీఎల్ వేలంలో కావ్య మార‌న్ క‌ళ‌క‌ళ‌

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ సీఇఓ హల్ చ‌ల్

Kavya Maran : ఐపీఎల్ వేలం 2022కు సంబంధించి బెంగ‌ళూరులో ఇంకా కొన‌సాగుతూనే ఉంది. కానీ నెట్టింట్లో మాత్రం ఒకే ఒక్కరు హాట్ టాపిక్ గా మారారు. ట్విట్ట‌ర్ లో టాప్ మోస్ట్ సెల‌బ్రెటీగా మారి పోయారు.

పోనీ ఆమె ప్లేయ‌ర్ కాదు అంత‌క‌న్నా హీరోయిన్ కాదు. ఇంకా చెప్పాలంటే సెల‌బ్రెటీ కూడా కాదు. కానీ ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో ఆడే 10 జ‌ట్ల‌లో ఒక‌టైన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫ్రాంచైజీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ కావ్య మార‌న్(Kavya Maran).

గ‌తంలో ఎప్పుడైతే తాము కొనుగోలు చేశారో ఆనాటి నుంచి ఆమె దానిని త‌న గుప్పిట్లోకి తీసుకుంది. కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. జ‌ట్టుకు స‌పోర్ట్ గా నిలుస్తున్నారు.

కానీ డేవిడ్ వార్న‌ర్ సార‌థ్యంలో జ‌ట్టు పూర్తిగా విఫ‌ల‌మైంది. దీనిని త‌ట్టుకోలేక పోయారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ జ‌రుగుతున్న ఐపీఎల్ వేలం పాట‌లో సెంట‌ర్ ఆఫ్ ది అట్రాక్ష‌న్ గా మారి పోయారు.

దేశ వ్యాప్తంగా కావ్య మార‌న్ ను చూసేందుకు ఎక్కువ ఆస‌క్తి చూపారు. గ‌తంలో ఐపీఎల్ ఆక్ష‌న్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ ఫ్రాంచైజీ త‌ర‌పున ప్రీతి జింటా హాజ‌ర‌య్యేది.

ఈసారి ఐపీఎల్ వేలం పాట‌లో షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్, సుహానా ఖాన్ హాజ‌రైనప్ప‌టికీ అంద‌రి క‌ళ్లు కావ్య మార‌న్ వైపు ఉన్నాయి. ఆమె లేక పోతే ఐపీఎల్ వేలం చూడ‌లేమంటూ కొంద‌రు క్రీడాభిమానులు ట్విట్ట‌ర్ లో పేర్కొన‌డం విశేషం.

దేశ వ్యాప్తంగా కావ్య మార‌న్ నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారి పోయారు. క‌ళానిధి మార‌న్ ముద్దుల కూతురు కావ్య మార‌న్(Kavya Maran). ఆమె ఆరెంజ్ ఆర్మీకి మ‌ద్ద‌తుగా స్టేడియంలో త‌మ జ‌ట్టు ఆడుతున్న‌ప్పుడు క‌నిపించి హ‌ల్ చ‌ల్ చేసింది.

దీంతో కోట్లాది క‌ళ్ల‌న్నీ ఆమె వైపు ప‌డ్డాయి. ఇప్పుడు మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ఐపీఎల్ వేలంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ‌వా

Leave A Reply

Your Email Id will not be published!