Arabic Kuthu Song : విజ‌య్ ‘అర‌బిక్ కుతు’ సెన్సేష‌న్

లిరిక‌ల్ వీడియోకు ఊహించ‌ని రెస్పాన్స్

Arabic Kuthu Song : త‌ల‌ప‌తి విజ‌య్ అంటే త‌మిళ‌నాట చెప్ప‌లేనంత క్రేజ్. సౌతిండియా సినీ ప‌రిశ్ర‌మ‌లో వెరీ వెరీ డిఫ‌రెంట్. ల‌క్ష‌లాది మంది ఫ్యాన్స్ అత‌డంటే ప‌డి చ‌స్తారు.

సినిమా వ‌స్తుందంటే చాలు ఎగ‌బ‌డి వేచి చూస్తారు. క‌రోనా క‌ష్ట కాలంలో త‌ను న‌టించిన మాస్ట‌ర్ దుమ్ము రేపింది. ఇక తాజాగా స‌న్ నెట్ వ‌ర్క్ నిర్మాణ సార‌థ్యంలో బీస్ట్ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

మాస్ట‌ర్ తో దుమ్ము రేపిన అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించాడు. ఇవాళ అధికారికంగా బీస్ట్ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ అర‌బిక్ కుతు(Arabic Kuthu Song) విడుద‌ల చేసింది.

రిలీజ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే రికార్డు బ్రేక్ చేసింది. అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే త‌ల‌ప‌తి విజ‌య్ తో హీరోయిన్ గా చేసింది. వీరిద్ద‌రూ క‌లిసి అర‌బిక్ హిందోలం అంటూ ఏఆర్ రెహ‌మాన్ పాట‌ను మించి పోయేలా తీసుకు వ‌చ్చాడు అనిరుధ్.

ఇక టాలీవుడ్ లో మ‌హేష్ బాబు ఓ వైపు స‌ర్కారు వారి పాట‌తో దూసుకు పోతుంటే ఇప్పుడు బీస్ట్ అర‌బిక్ కుతు కూడా అదే స్థాయిలో పోటీ ప‌డి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.

నెట్టింట్లో హ‌వా కొన‌సాగిస్తోంది. పాట‌కు త‌గ్గ‌ట్టు విజ‌య్ చేసిన డ్యాన్స్ అబ్బా అనిపించేలా ఉంది. ఈ అర‌బిక్ కుతును శివ కార్తికేయ‌న్ సాహిత్యం అందించారు.

నెల్స‌న్ రాజ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు బీస్ట్ మూవీకి. విజ‌య్, పూజాతో పాటు సెల్వ రాఘ‌వ‌న్ , యోగి బాబు, రెడిన్ కింగ్స్ , వీటీవి గ‌ణేష్ , అప‌ర్ణా దాస్ న‌టించారు.

Also Read : ఎండా కాలం లోనే న‌వ్వుల వినోదం

Leave A Reply

Your Email Id will not be published!