Nitish Kumar : చ‌న్నీ కామెంట్స్ నితీష్ సీరియ‌స్

సీఎం ఇలాగేనా మాట్లాడేదంటూ ఫైర్

Nitish Kumar : పంజాబ్ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ యూపీ, బీహారీల‌పై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. వాళ్లను ఎన్నిక‌ల‌య్యేంత వ‌ర‌కు పంజాబ్ లోకి రానీయ వ‌ద్దంటూ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో అన‌డం ర‌చ్చ‌కు దారి తీసింది.

దీనిపై ఇప్ప‌టికే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌ద్గురు జ‌యంతి రోజున చ‌న్నీ ఇలా ఎలా మాట్లాడ‌తాడంటూ నిల‌దీశారు. స‌ద్గురు పుట్టింది బీహార్ లో అని మ‌రి ఆయ‌న‌ను కూడా అక్క‌డికి పంపిస్తారా అంటూ ప్ర‌శ్నించారు.

ఈ త‌రుణంలో బీహారీలను రావ‌ద్ద‌నడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు బీహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar). ఉత్త‌ర ప్ర‌దేశ్ , బీహార్ దే భాయిల‌ను రాష్ట్రంలోకి రానివ్వ‌మంటూ చెప్ప‌డానికి నువ్వు ఎవ‌రు అంటూ మండిప‌డ్డారు సీఎం.

ఒక ర‌కంగా తన‌ను తీవ్రంగా క‌లిచి వేసేలా చేసింద‌న్నారు సీఎం. పంజాబ్ రాష్ట్ర అభివృద్ధికి బీహార్ నుంచి వ‌చ్చిన ప్ర‌జ‌లు ఎలా స‌హ‌క‌రించారో నీకు తెలుసా అని నిల‌దీశారు.

ఒక ర‌కంగా రాష్ట్రం ప‌ట్ల‌, ప్ర‌జ‌ల ప‌ట్ల ఇలాంటి వ్యాఖ్య‌లు ఎలా చేస్తారంటూ అన్నారు. ప్రియాంక గాంధీ పంజాబ్ కు చెందిన కోడ‌లు.

ఆమె పంజాబీల బ‌హు. ఉత్త‌ర ప్ర‌దేశ్ , బీహార్ కు చెందిన భ‌య్యాలు (నేత‌లు ) ఇక్క‌డిక వ‌చ్చి పాలించ లేర‌ని ప్ర‌క‌టించారు సీఎం చర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ.

ఇక్క‌డి వ‌స్తే వాళ్ల‌ను అనుమతించ బోమంటూ స్ప‌ష్టం చేశారు. చ‌న్నీ చేసిన కామెంట్స్ కు చ‌ప్ప‌ట్లు కొడుతూ స‌పోర్ట్ చేశారు ప్రియాంక గాంధీ. దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ మండిప‌డ్డారు సీఎం నితీష్ కుమార్.

Also Read : చ‌న్నీ కామెంట్స్ పై మోదీ ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!