Liz Hurley Warne : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం 52 ఏళ్లకే అనుకోని రీతిలో కాలం చేయడంతో యావత్ క్రీడా లోకం దిగ్భ్రాంతికి లోనైంది. షేన్ వార్న్ తో సుదీర్ఘ కాలం పాటు ప్రేమాయణం నడిపిన మాజీ ప్రియురాలు, ప్రముఖ నటి ఎలిజెబెత్ హార్లీ స్పందించింది.
వార్న్ లేడన్న విషయాన్ని జీర్ణించు కోలేక పోతున్నానని వేదన వ్యక్తం చేసింది. తీవ్ర భావోద్వేగానికి లోనైంది. సోషల్ మీడియా వేదికగా తామిద్దరం కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది.
నిజంగా నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. హృదయం అంతా శూన్యంగా మారి పోయింది. ఒక అద్భుతమైన ఆటగాడే కాదు గొప్ప ప్రేమికుడు కూడా. తన మాజీ ప్రియుడికి కడసారి వీడ్కోలు పలుకుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరింది.
వార్న్ మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తున్నాడు. మిగతా వ్యక్తుల కంటే అతడు భిన్నం. జీవన ప్రయాణంలో మేమిద్దరం కలుసుకున్న క్షణాలు, మాట్లాడుకున్న మాటలు నన్ను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
నటిగా నేను ఎన్నో పాత్రలు చేసి ఉండవచ్చు. కానీ వార్న్(Liz Hurley Warne) నా మనసు దోచుకున్న ప్రియుడు. కొంత ఇబ్బందికర పరిస్థితుల కారణంగా మేమిద్దం విడి పోయాం. కానీ మా ప్రేమ అలాగే ఉండి పోయింది.
సూర్యుడు మేఘాల వెనక్కి వెళ్లినట్లుగానే వార్న్ కొంత గ్యాప్ తీసుకునేందుకు వెళ్లాడని అనిపిస్తోందని పేర్కొంది ఎలిజెబెత్ హార్లీ. ఐ మిస్ యూ లవ్లీ వార్న్ అంటూ పేర్కొంది.
2011లో ఇద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. రెండేళ్ల పాటు కలిసి ఉన్నారు. 2013లో వార్న్ హార్లీ విడి పోయారు.
Also Read : స్నేహం పదిలం అరుదైన దృశ్యం