Gangubai Kathiawadi : ‘గంగూబాయి’ క‌లెక్ష‌న్ల సునామీ

రూ. 108 కోట్ల వ‌సూలు చేసిన‌ట్లు ప్ర‌క‌ట‌న

Gangubai Kathiawadi : క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది గంగూబాయి క‌తియావాడి(Gangubai Kathiawadi) మూవీ. ఏకంగా రూ. 100 కోట్ల క‌లెక్ష‌న్లు సాధించి విస్తు పోయేలా చేసింది.

ప్ర‌ముఖ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా బ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు ఈ చిత్రాన్ని. ప్రస్తుతం విడుద‌లైన అన్ని థియేట‌ర్ల‌లో బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. నిన్న‌టి ఒక్క‌టి రోజే రూ. 4 కోట్లు కొల్ల‌గొట్టి వంద కోట్ల‌ను దాటేసింది.

అలియా భ‌ట్ న‌టించిన నాల్గో చిత్రం ఇది. ఇవాళ ఈ మూవీ గురించి అప్ డేట్ వ‌చ్చింది. చ‌ల‌న చిత్ర రంగానికి చెందిన విశ్లేష‌కుడు, విమ‌ర్శ‌కుడు త‌రణ్ ఆదర్శ్ రూ. 108 కోట్ల మార్కును చేరుకున్న వార్త‌ను పంచుకున్నారు.

ఈ సంఖ్య‌ను సాధించిన నాలుగో చిత్రంగా ఆయ‌న పేర్కొన్నారు. సూర్య వంశీ, అల్లు అర్జున్ న‌టించిన హిందీ పుష్ప ఈ మార్క్ ను దాటేసింది. ఆ సినిమాల స‌ర‌స‌న గంగూబాయి క‌తియావాడి నిలిచింది.

ప్ర‌స్తుతం ఆలియా భ‌ట్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో న‌టిస్తోంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్ కూడా మొద‌లైంది.

ఇదిలా ఉండ‌గా గంగూబాయి క‌తియావాడి కేవ‌లం వారం రోజుల్లోనే వంద కోట్ల‌ను సాధించి విమ‌ర్శ‌కుల‌ను విస్తు పోయేలా చేసింది. ప్ర‌స్తుతం క‌రోనా క‌ష్ట కాలంలో క‌తియావాడి వ‌సూళ్లు సాధించ‌డం విశేషం.

ఈ విష‌యాన్ని త‌రుణ్ ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా రూ. 294 కోట్లు కొల్ల‌గొట్టింది అక్ష‌య్ కుమార్ మూవీ సూర్య‌వంశీ. ర‌ణ‌వీర్ సింగ్ 83 మూవీ రూ. 193 కోట్లు కొల్ల‌గొట్టింది.

Also Read : మీ విడాకులు స‌రే…. ప్రార్ధ‌న ప‌రిస్థితేంటి?

Leave A Reply

Your Email Id will not be published!